సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా రికార్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజే 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన భరత్ అనే నేను సోమవారం పూర్తయ్యే సరికి 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.


ఇక యూఎస్ లో టాప్ 5 కలక్షన్స్ లో స్థానం సంపాదించింది మహేష్ సినిమా. మహేష్ సినిమా అంటే ఓవర్సీస్ లో లెక్క వేరేలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయినా సరే అక్కడ హిట్ కొడతాయి. ఇక ఇక్కడ అక్కడ మంచి టాక్ రావడంతో భరత్ అనే నేను అసలు సిసలు మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది.


సోమవారం ఖైది నంబర్ 150, అఆ సినిమాలను బీట్ చేసిన భరత్ 5వ స్థానంలో ఉంది. బాహుబలి 2, బాహుబలి బిగినింగ్, రంగస్థలం, ఆ తర్వాత శ్రీమంతుడు ఇలా హయ్యెస్ట్ కలక్షన్స్ లిస్ట్ లో ఉండగా ఆ లిస్ట్ లో 5వ స్థానంలో నిలిచింది భరత్ అనే నేను. భరత్ దూకుడు చూస్తుంటే శ్రీమంతుడు, రంగస్థలం వసూళ్లను కూడా దాటేసి థ్రిడ్ ప్లేస్ లో నిలిచేలా ఉంది.


కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపించాడు. సమాజంలో జరుగుతున్న కొన్నిటి గురించి ప్రస్థావించిన కొరటాల శివ సినిమాతో తన హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: