‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ కావడంతో ఈమూవీ సక్సెస్ మీట్ ను మరి కొద్ది రోజులలో తిరుపతిలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ తరువాత మహేష్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మే నెల మొదటి వారంలో వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ కు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మహేష్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా రూపొందింపబడుతున్న ఈమూవీ కథ విషయంలో వంశీ పైడిపల్లి అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మహేష్ గత నాలుగేళ్లలో చేసిన సినిమాలు గమనిస్తే అన్నింటిలోను బాగా డబ్బున్న వాడిగానే కనిపించాడు. దీనికి మినహాయింపు ఒక్క ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒక్కటే. దీనితో మహేష్ ఇప్పటి వరకు చేసిన పాత్రలు అన్నీ హై ప్రొఫైల్ హీరో రోల్స్ గా మారిపోయాయి. అందువల్లనే వంశీ పైడిపల్లి మహేష్ ని తన సినిమాలో డిఫరెంట్ గా కనిపించే ఊర మాస్ లుక్ లో చూపించే విధంగా ఈసినిమా కథను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
ALLARI NARESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలోని పాత్ర గతంలో అల్లరి నరేశ్ ‘గమ్యం’ సినిమాలో నటించిన గాలి శీను పాత్రను పోలి ఉంటుందని సమాచారం. ఈమూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో తీయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈమూవీలో మరొక ముఖ్య పాత్రను పోషిస్తున్న అల్లరి నరేశ్ తన నటనకు భిన్నంగా చాల హుందాగా కనిపించే కోటీశ్వరుడు పాత్రలో కనిపిస్తాడని టాక్. అంతేకాదు అల్లరి నరేశ్ పాత్రకు నెగిటివ్ టచ్ ఉండే విధంగా డిజైన్ చేసారని వార్తలు వస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ప్రస్తుతం ‘భరత్’ సక్సెస్ హవాలో మహేష్ ఉన్న నేపధ్యంలో ఈమూవీని ప్లాన్డ్ గా ఎటువంటి బ్రేకులు లేకుండా సుమారు ఆరు నెలలలో నిర్మించి ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేసుకు రెడీ అయ్యే విధంగా తీర్చి దిద్దాలని దిల్ రాజ్ ఆలోచన అని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ హవా కొనసాగుతున్న నేపధ్యంలో ఈమూవీ బిజినెస్ అత్యంత భారీ స్థాయిలో జరిగి దిల్ రాజ్ కు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: