ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ది పొందిన క్రీడ రెజ్లింగ్ లో రాక్ డ్వేయిన్ జాన్సన్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే.  రాక్..రాక్ అంటూ అభిమానులు కేరింతలు..అరపులతో క్రీడా ప్రాంగణం దద్దరిల్లి పోయేది. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ రాక్ మంచి ఫామ్ లో ఉండగానే హాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తాజాగా రాక్ డ్వేయిన్ జాన్సన్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారెన్ హషియన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాక్ కు ఇప్పుడు మొత్తం ముగ్గురు కూతుళ్ళు.
Related image
లారెన్ హషియన్ కు.. రాక్ కు.. ముందే ఓ ఆడపిల్ల ఉంది. అలాగే రాక్ కు మొదటి రిలేషన్ షిప్ వలన 16 ఏళ్ల కూతురు సిమోన్ అలెగ్జాండ్రా కూడా ఉంది.  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటే రాక్ తన అకౌంట్ లో మూడో కూతురితో కలిసి మొదటి ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే ఆ చిన్నారి పేరును కూడా బయటపెట్టాడు. 
Related image
తన బిడ్డపేరు  ‘టియానా జియా జాన్సన్’ అని తన 103మిలియన్ల ఫాలోవర్స్ కు తెలిపాడు. ఈ చిన్నారి తమ జీవితాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని రాక్ తెలిపాడు.  కాగా రాక్ డ్వేయిన్ జాన్సన్ మరోసారి తండ్రి కావడంతో ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. రాక్ 2007 నుండి సింగర్ లారెన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. గత ఏడాది చివరిలో తమ పుట్టబోయే పాప విషయాన్ని బయటపెట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: