సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను వ‌ర‌ల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లోనూ ఫుల్ స్వింగ్ వ‌సూళ్ల‌తో వెళుతోంది. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన‌ట్టు చెపుతున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా రూ.130 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం.

Image result for bharat ane nanu

అమెరికాలో ఇప్ప‌టికే 2.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన భ‌ర‌త్ మ‌రో ఒక‌టి రెండు రోజుల్లోనూ 3 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను దాటేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు రోజుల‌కే రూ 42.03 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి. 

Related image

' భ‌ర‌త్ అనే నేను '  4 డేస్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో)
నైజాం - 11.65
సీడెడ్ - 6.15
నెల్లూరు - 1.59
కృష్ణా - 3.42
గుంటూరు - 6.03
వైజాగ్ - 5.69
ఈస్ట్ - 4.80
వెస్ట్ - 2.88
-----------------------------------
ఏపీ+తెలంగాణ = 42.03 కోట్లు
-----------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: