టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కాస్టింగ్ కౌచ్ దెబ్బకి కుదేలవుతుంది. ఒకొక్కరుగా ఇండస్ట్రీలోని మహిళలందరూ తమకు జరిగిన చేదు అనుభవాలను బహిరంగంగా బయటపెట్టడం, దీనివల్ల ఇండస్ట్రీ యొక్క ప్రతిష్ఠ దిగజారుతుందేమో అన్న అంశం సినీ పెద్దలను కలవరపెడుతోంది. ఇక సినీప్రముఖులు ఎక్కడికివెళ్ళినా కాస్టింగ్ కౌచ్ పై స్పందన తెలియజేయండంటూ  మీడియా వెంటబడడం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. 


ఇలాంటి వాటితో విసిగిపోయిన మంచు మనోజ్ ఏకంగా ఒక ప్రకటనను విడుదల చేశాడు. ఆ ప్రకటనలో తెలుపుతూ- " ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రంగాలలో నెలకొన్న పరిస్థితులపై నేను స్పందించాలని ట్వీట్లు కూడా పెడుతున్నారు. మరికొంతమంది నేను తప్పించుకతిరుగుతున్నానని అంటున్నారు. నేను ఎలాంటి వాడినో చాలామందికి తెలుసు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వివాదంలో కొంత‌మంది భాగస్వాములయ్యారు. మరికొంత‌మందిని ఇందులోకి ఇరికించారు ".


"లైంగిక వేధింపులు అన్ని రంగాలలో ఉన్నాయి. ఒక్క సినీ రంగంలోనే ఇది  ఉంద‌ని నిందవేయడం స‌రికాదు. సినీ రంగంలో ఉన్న మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి పోరాడుతాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. ఈ విష‌యంలో నేను పూర్తిగా ఆయ‌న‌కు మద్దతునిస్తా. ఏదిఏమయినా సినీరంగంలోని మనమంతా ఒక కుటుంబంలాంటి వాళ్ళం. మనం ఎంత సంయమనం పాటిస్తే అంత త్వరగా ఈ వివాదం సర్దుమణుగుతుంది" అని రాసుకొచ్చాడు. చివర్లో..ఈ విషయాన్ని మీడియా కొద్దిగా డీసెంట్ గా చూపించివుంటే ఇంత వివాదం అయ్యేది కాదు అంటూ చురకలు అంటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: