రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా గురించి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా బాగాలేదు అన్న వారు అసలు లేరని చెప్పొచ్చు. అందుకే మహేష్ స్టామినా ప్రూవ్ చేసేలా ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది. 


ఇక ఓవర్సీస్ లో అయితే మహేష్ లెక్క ఏ రేంజ్ లో ఉంటుందో చూపిస్తుంది. 4 రోజుల్లోనే అక్కడ టాప్ 5వ స్థానం సంపాదించుకుంది భరత్ అనే నేను. ఇక ఈ సినిమాలో మహేష్ యంగ్ సిఎం పాత్రలో కనిపిస్తారు. యంగ్ సిఎం అనగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పేరు బాగా వినపడుతుంది.


జనసేన అధినేతగా పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. అయితే భరత్ అనే నేను కథ మహేష్ కాకుండా పవన్ చేస్తే ఎలా ఉంటుంది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇదే విషయాన్ని కొరటాల శివ దగ్గర ప్రస్థావించారు. అసలు ఈ కథ పవన్ కోసమే రాసుకున్నారని కాని ఆయన కాదనబట్టే మహేష్ కు వచ్చిందని వార్తలు రాశారు.


అయితే ఈ విషయంపై స్పందించిన కొరటాల శివ ఈ సినిమా కేవలం మహేష్ కోసమే అనుకున్నానని అన్నారు. పవన్ కోసం రాశానన్న వార్ర్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. మహేష్ బాబే ముఖ్యమంత్రి అయితే అన్న ఆలోచనతో ఈ కథ రాసుకున్నాని అన్నారు. మొత్తానికి కొరటాల శివ నమ్మకం నిజమయ్యేలా భరత్ సూపర్ హిట్ అయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: