టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై హీరోలఅభిప్రాయాలు తీసుకోవడానికి అదేవిధంగా కొందరి హీరోలపై నెగిటివ్ వార్తలను ప్రసారంచేస్తున్న న్యూస్ ఛానల్స్ ను నియంత్రించడానికి నిన్న చిరంజీవి ఆద్వర్యంలో జరిగిన హీరోల సమావేశంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్నసాయంత్రం 7 గంటలకు అత్యంత రహస్యంగా మీడియా వర్గాలకు ఎటువంటి న్యూస్ అందనీయకుండా చిరంజీవి ఈసమావేశాన్ని నిర్వహించిన్నట్లు వార్తలువస్తున్నాయి. ఈసమావేశానికి 20 హీరోలను పిలిస్తే టాప్ హీరోలుగా పేరుగాంచిన బాలకృష్ణ వెంకటేష్ జూనియర్ లు ఈహీరోల సమావేశానికి రాకపోవడం ఒక ట్విస్ట్. 
సంబంధిత చిత్రం
ముఖ్యంగా బాలకృష్ణ అయితే మీడియాను నియంత్రించే నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటుచేసిన ఈసమావేశానికి తనమద్దతు ఉండదు అని స్పష్టంగా చిరంజీవికి తెలియచేసినట్లు టాక్. తెలుస్తున్న సమాచారంమేరకు ఈహీరోల సమావేశానికి మహేష్ రామ్ చరణ్ అల్లుఅర్జున్ నానీలతో పాటు కొంతమంది చిన్నహీరోలు అదేవిధంగా నిర్మాతల వర్గానికి సంబంధించి అల్లుఅరవింద్ నాగబాబులు కూడ హాజరైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా జీవితరాజశేఖర్ మంచులక్ష్మిలు కూడ ఈసమావేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసమావేశానికి నాయకత్వం వహించిన చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను అందరికీ వివరించి న్యూస్ ఛానల్స్ పై నియంత్రణ విధించాలి అని వస్తున్న ఆలోచనపై ప్రతిఒక్కరు తమఅభిప్రాయాలను తెలిపితే హీరోల అభిప్రాయాలను బట్టి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈవిషయమై ఒక నిర్ణయం తీసుకుంటుంది అని తనఅభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి ఒకరిద్దరు సీనియర్ హీరోలు సమస్య తీవ్రంగానే ఉందని కానీ వికటించకుండా రివర్స్ కాకుండా నిర్ణయం ఉంటే బాగుంటుదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు టాక్. అదేవిధంగా సినిమా అన్నది ఎంటర్ టైన్ మెంట్ కనుక ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లకే ప్రయారిటీ ఇస్తూ న్యూస్ ఛానెళ్లను నెమ్మదిగా పక్కకు పెడితే సరిపోతుందని దీనికి బ్యాన్ లాంటి పెద్దపదాలు అనవసరం అనే అభిప్రాయాన్ని కొంతమంది టాప్ హీరోలు వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. మరికొందరు హీరోలు అయితే తమిళనాడులో న్యూస్ ఛానెల్స్ కు యాడ్స్ ఇచ్చే విషయంలో కోలీవుడ్ ఇండస్ట్రీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇక్కడ కూడ అమలుపరిస్తే సరిపోతుందని న్యూస్ ఛానల్స్ తో బహిరంగ శతృత్వం అనవసరం అన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలువస్తున్నాయి. 
TOP HEROES PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఏవిషయం పై అయినా ఏకాభిప్రాయం రాకుండా హీరోలు అందరు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈవిషయాలు ఏమీ ఎట్టిపరిస్తుతులను మీడియాకు లీక్ కాకూడదు అని చిరంజీవి చెప్పిన నేపధ్యంలో మరొకసారి కలుద్దాం అంటూ హీరోలు అంతా ఈసమావేశాన్ని ముగించినట్లు తెలుస్తోంది. అయితే ఈసమావేశం జరిగి కొన్నిగంటలు కూడ కాకుండానే హీరోలు నిలువుగా చీలిపోయారని ఛానల్స్ కు సంబంధించిన ప్రతినిధులు బయటకు లీకులు పంపారని గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: