తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లో చిత్రాలు వస్తే..అవి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితీరుతాయిన.  శ్రీమంతుడు లాంటి అద్భుతమైన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కొరటాల శివ, మహేష్ ఘనవిజయం సాధించారు.  ఆ తర్వాత మహేష్ బాబు కి రెండు డిజాస్టర్స్ వచ్చాయి..దాంతో మరో విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం విడుదలై బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించింది. అన్ని వ‌ర్గాల నుంచి ఈ మూవీకి ప్రశంస‌లు ల‌భించాయి.

తాజాగా ఈ మూవీని తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించారు. ప్రతి రాజకీయ నాయకుడు చూడాల్సిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహేష్, కొరటాలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా 'భరత్ అనే నేను' చిత్రాన్ని చూశారు.  తాను చాలా ఎంజాయ్ చేశానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.  థియేట‌ర్ కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మ‌హేష్, ద‌ర్శకుడు కొర‌టాల శివ‌లు బొకే ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. త‌ర్వాత కేటీఆర్‌తో క‌ల‌సి వారంతా ఈ మూవీని వీక్షించారు.ముఖ్యమంత్రిగా మ‌హేష్ బాగా న‌టించార‌ని, ద‌ర్శక‌త్వ విలువలు ఉన్న మూవీ అని ప్రశంసించారు.

అటు తమ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసినందుకు, అభినందించినందుకు కేటీఆర్‌కు హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  ప్రజా జీవితం ఎలా ఉంటుందన్న అంశంపై హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలతో చర్చలో పాల్గొన్నానని మంత్రి తెలిపారు.

మరోవైపు ఈ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: