గత కొన్ని రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన నటి శ్రీరెడ్డి  పోరాటం మంచి స్టేజ్ లో ఉందనుకున్న సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై కొన్ని అనరాని మాటలు అనడంతో సీన్ అంతా రివర్స్ అయ్యింది.  అప్పటి వరకు ఆమెకు మద్దతు ఉన్నవారంతా యూటర్న్ తీసుకున్నారు.  అంతే కాదు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి హద్దు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి విషయంలో వర్మ జోక్య చేసుకొని ఆమెచే అలా తానే అపినించానని స్టేట్ మెంట్ ఇవ్వడం ఈ విషయం కాస్త వర్మ వర్సెస్ మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ మాటల యుద్దం సాగడం జరిగింది.

ఇకపోతే పవన్ కళ్యాన్ మొన్న ఫిలిమ్ ఛాంబర్ లో కొన్ని టీవి ఛానల్స్ వల్లే ఇలాంటివి రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయని..అంలాంటి టివి ఛానల్స్ ని బైకాట్ చేయండి అనడం మరో వివాదానికి తెరలేపింది.  ఇక మద్య మద్యలో శ్రీరెడ్డి జనసేన అధ్యక్షుడితో ఫేస్ బుక్ లో వాయిస్తూనే ఉంది. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విషయంలో శ్రీరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా అంటే ఔననే సమాధానం వస్తుంది ఆమె తాజా కామెంట్స్ గమనిస్తే. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్టు చేసింది.

వ్యక్తి పేరు చెప్పకుండా ఒకాయనపై తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నానని ప్రకటించింది."ఇక నుంచి మళ్ళీ మా నిరసనలు కొనసాగిస్తాం... నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ప్రత్యేకించి కోపం లేదు... అయితే..ఓ వ్యక్తి వ్యాఖ్యలతో, ప్రవర్తనతో బాధపడ్డాము. ఆయనపై చేస్తున్న పోరాటాన్ని ఇక నుంచి ఆపేస్తున్నాను. నా పోరాటం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రక్షాళన చేయడం పైనే ఉంటుంది.
Image result for pawan kalyan film chamber
ఇకపై వ్యక్తిగత యుద్ధాలు ఉండకపోవచ్చు... నా వ్యక్తిగతం కన్నా ..  నిరసనలనే నేను ఎక్కువగా గౌరవిస్తున్నాను. కృతజ్ఞతలు" అని శ్రీరెడ్డి పేర్కొంది . దీంతో ఇప్పుడు పవన్ కళ్యాన్ విషయంలో శ్రీరెడ్డి యూటర్న్ తీసుకోబోతుందా..కాస్టింగ్ కౌచ్ పోరాటాంపై దృష్టి పెడుతుందా అని అందరూ అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: