ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలయ్య నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు. మార్చి 29వ తేదీ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది ఈ మూవీ షూటింగ్. సినీ ఇండస్ట్రీలోని అతిరధ మహారధులు అందరూ తరలివచ్చారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అన్న టైంలో.. కీలకమైన డైరెక్టర్ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం చర్చనీయాంశం అయ్యింది. తేజ తానే తప్పుకున్నాడా.. లేక తప్పించారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. 

ఎన్టీఆర్ సినిమాకి న్యాయం చేయలేనేమోనన్న భయంతో డ్రాప్ అవుతున్నట్లు డైరెక్టర్ తేజ బ్రేకింగ్‌న్యూస్ ఇచ్చేశాడు. ఏడాదిపాటు కష్టపడి స్క్రిప్ట్ ఓకే చేసి క్యాస్టింగ్ విషయంలో కూడా కొద్దికొద్దిగా క్లారిటీకి వస్తున్న ఈ తరుణంలో తేజ వెనకడుగు వేయడం సీరియస్ అంశమే!అయితే ఈరోజు కూడా తేజ – బాల‌య్య మ‌ధ్య ఓ మీటింగ్ జ‌రిగింద‌ని, ఇప్ప‌టికీ బాల‌య్య తేజ‌వైపే మొగ్గు చూపిస్తున్నాడ‌ని కానీ తేజ మాత్రం ఈ ప్రాజెక్టుని దాదాపుగా వ‌దిలేశాడ‌ని టాక్‌.
Image result for ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ ఔట్
తేజ ఈసినిమా వ‌దులుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… ప‌ని ఒత్తిడి. ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. దాన్ని అందుకోక‌పోతే… తేజ వైపే వేళ్ల‌న్నీ చూపిస్తాయి. ఈ మద్య నేను రాజు నేనే మంత్రి తో మంచి విజయం అందుకున్న తేజ..తాను తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ మంచి విజయాన్ని అందించగలనా అన్న అనుమానాలు అతనికే కలిగాయట.  పైగా ఎన్టీఆర్ స్క్రిప్టు తాను రాయ‌లేదు.
Image result for ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ ఔట్
క‌థ ఎలా ఉండ‌బోతుంది? ఎక్క‌డి నుంచి మొద‌ల‌వుతుంది? అనే విష‌యాల్లో తేజ‌కు ఏమాత్రం అవ‌గాహ‌న లేదు. ఇప్ప‌టికే త‌యారైన స్క్రిప్టుని ‘బాల‌య్య ఆదేశాల‌’ అనుగుణంగా సినిమాగా తీయాలి.  అందుకే.. తేజ ఇమ‌డ‌లేక‌పోయి ఉండొచ్చు. బాల‌య్య లాంటి న‌టుడ్ని హ్యాండిల్ చేయ‌డం చాలా క‌ష్టం. బోయ‌పాటి, క్రిష్ లాంటి వాళ్ల‌కు అది సాధ్య‌మైంది. స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయ‌డం తేజ‌కు తెలియ‌ని విష‌యం.

తాను చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌నే.. కొత్త‌వాళ్ల‌తో తేజ సినిమాలు తీస్తుంటాడు. బాల‌య్య లాంటి స్టార్‌తో సినిమా చేయ‌డం వెనుక ఉన్న కష్ట న‌ష్టాలేంటో తేజ‌కు తెలుసు. అందుకే.. స్వ‌చ్ఛందంగా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: