భారత దేశానికే కాదు విశ్వ వినీల చలన చిత్రాకాశంపై దృవతారగా వెలుగొందిన మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు అభిమానుల కు మాత్రమే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా ఇది షాకిచ్చే వార్త. ఇది ఒక పుకారైతే బావుణ్ణు అనిపిస్తుందెవరికైనా.  ప్రతిష్టాత్మకమైన మొదలుపెట్టిన "ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం" నుంచి విలక్షణ దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.
Image result for ntr biopic - teja balakrishna
నందమూరి తనయుడు ఆ చిత్ర నిర్మాత బాలకృష్ణతో ఏర్పడ్డ విభేదాల వలననే దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి నిష్క్రమిస్తున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఒక భారీ సంచలన చిత్రంగా తెరకెక్కించాలని ఆయన భావించారు.  అనుకున్నదే తడవుగా, ఈ చిత్రం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే మే నెలలో ప్రారంభం అవుతుందని ఇటీవల కథానాయకుడు బాలకృష్ణే ప్రకటించారు. కానీ ఇంతలో ఏమైందో ఎమో దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు ఒక షాకింగ్ ప్రకటన చేయటం నందమూరి అభిమానులకు ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. సినిమా అభిమానులకు ఒకింత నిరాశ కలిగించింది. అంతలోనే మరోవైపు కొత్త దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు తెరపైకొచ్చిచింది. .  
 నిర్ణయమే సంచలనం
\ఎన్టీఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినీ కథానాయకుడే కాదు అంతకు మించిన ప్రజానాయకుని జీవితచరిత్ర వెండితెరపై కెక్కించాలనే సంచలన నిర్ణయం గత ఏడాది స్వయం గా ఆయనన పుత్రరత్నం నందమూరి బాలకృష్ణ తీసుకున్నారు. 
Image result for ntr biopic - teja balakrishna
ఆయన జీవితమే చారిత్రాత్మకం సాంప్రదాయ సంస్కృతుల సమ్మేళనం. అంతేకాదు సంచలనం కూడా! ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో చీకటి, వెలుగులు మాత్రమే కాదు అద్భుతాలు ఆనందాలు అవమానాలు సంగ్తోషాలు సంతాపాలు వివిధ కోణాలు కనిపిస్తాయి. అంటే జీవితం ధీరోదాత్తతతో కూడిన నవరసాత్మక సమ్మేళనం. ఎన్టీఆర్ సాధారణ సాంఘిక కథానాయకునిగానే కాదు, ఒక పౌరాణిక, చారిత్రాత్మక, జానపధ కథానాయకునిగా, నవరసాలు సమానంగా పండించిన నటుడిగా ఆయన జీవితం చరితార్ధం. చరిత్రలో నిలిచిపోయేలా సాధించిన విజయాలు, రాజకీయాల్లో ఆయన సత్తా చాటిన విధానం, చివరిరోజుల్లో ఆయన ఎదుర్కొన్నకష్టాలు తెలుగువారిని కన్నీరు పెట్టించిన సంఘటనలే. సకల తెలుగు ప్రజలకు అనుభవైఖ్యవేధ్యమే.  
Image result for ntr biopic - teja balakrishna
నందమూరి బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ తెరకెక్కించాలని నిర్ణయం ప్రకటించిన తరువాత దరర్శకుడిగా రాంగోపాల్ వర్మ పేరు తొలుత వినిపించింది. రాంగోపాల్ వర్మ ఆసమయంలో ఎన్టీఆర్ పేరు మీద ఒక గేయగీతాన్ని (సాంగ్) కూడా విడుదలచేసారు. కానీ చివరకు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దర్శకుడు తేజ దక్కించు కున్నాడు. తనకు ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరకెక్కించే అవకాశం దక్కలేదని రాం గోపాల్ వర్మ మనస్తాపం చెందాడో? ఏమో? కానీ ఆ ఆవేశములో వెనువెంటనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాన్ని యవనికపై తీసుకునివచ్చారు. లక్ష్మిపార్వతి, ఎన్టీఆర్ మధ్య జరిగిన ఉద్వేగభరిత సన్నివేశాలను ఈ చిత్రంలో చూపిస్తానని తెలిపాడు. అప్పట్లో ఇది చాలా వివాదంగా మారింది. ఆ తరువాత అసలు ఈ ప్రాజెక్టే అటకెక్కింది. 
Image result for ntr biopic - teja balakrishna
దర్శకుడు తేజ ఇప్పుడు తీసుకున్న సంచలన నిర్ణయంతో అటు సినీ వర్గాలకు, నందమూరి అభిమానులకు, సినీ అభిమానులకు ఒక్కసారిగా ఊహించనంత భారీషాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. "నేనే రాజు నేనే మంత్రి" చిత్రం విజయంతో ఒక్కసారి విజయపథాన మరల ట్రాక్ లోకి వచ్చిన తేజకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఒక అద్భుత గోల్డెన్ ఆఫర్ అని అందరం భావించాము.  
Image result for ntr biopic - teja balakrishna
అయితే ఇప్పుడు తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన సినీవర్గాలని కూడా భారీ షాక్ కి గురిచేస్తోంది. తేజ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుంచి తప్పుకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియడం మాత్రం తెలియ రాలేదు. నందమూరి బాలకృష్ణ తేజ మధ్య కథ విషయంలో తలెత్తిన విభేదాలు తేజను తప్పుకునేటట్లు దారి తీసినట్లు ప్రాధమిక సమాచారం.  దర్శకుడు తేజ తనకు తానే ఆ ప్రఖ్యాత నటుని పాత్రను తాను హాండిల్ చేయలేనేమోనని తన అనుభవం అందుకు చాలదేమోనని సంశయిస్తూ తప్పుకోవటం నమ్మాలనిపించటం లేదు అంటున్నారు ప్రఖ్యాత టాలీవుడ్ సీనియర్స్. ఇది పూర్తిగా దర్శకుడు తేజతో నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి మాత్రమే అయివుండవచ్చని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం.   

Image result for ntr biopic - teja balakrishna
విశ్వవిఖ్యాత నటసార్వభౌముని అనంత జీవితచరిత్రని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించాలి, ఏ కోణాల్లో ఆ మహనీయుని పాత్రని ఆవిష్కరించాలి అనే అంశాల్లో ఇద్దరి మధ్య విపరీత భేదాభిప్రాయాలు తలెయ్త్తినట్లు తెలుస్తోంది. అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్న ఈ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి నందమూరి బాల కృష్ణ బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్ర కొత్త దర్శకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు వినిపిస్తోంది. మిగిలిన అంశాలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

Image result for ntr biopic - teja balakrishna

మరింత సమాచారం తెలుసుకోండి: