ఇటీవల వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలి ప్రేమ అనే అందమైన ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన కరుణా కరన్ తో సినిమా చేస్తున్నాడు . కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. తిక్క, జవాన్, విన్నర్, ఇంటెలిజెంట్ సినిమాలతో ఢీలాపడ్డ సాయిధరమ్ ప్రస్తుతం ఆయన మావయ్య పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ ను నమ్ముకున్నాడు.
Image result for sai tej karunakaran
గత కొద్దికాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా వున్నా క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. సినిమాకు దేవుడు వరమందిస్తే అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. కాని అదంతా రూమర్ అని సాయిధరమ్ తెలియజేశాడు. 
Image result for sai tej karunakaran
గోపీ సుందర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కొద్ది సేపటి క్రితం చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్ . ప్రీ లుక్ లో సాయిధరమ్ ని బ్యాక్ నుండి చూపించిన మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: