భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘన విజయం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి2’ లు సాధించాయి.  అప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే రికార్డులు కైవసం చేసుకునే పరిస్థితి ఉండేది..కానీ బాహుబలి సినిమా తర్వాత ఆ రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఇక బాహుబలి 2 అయితే ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.  ఇండియన్ సినిమా హిస్టరీలో కనీ వినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించింది.
Image result for bahubali 2
దాదాపు రూ.1650 కోట్ల కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.  అయితే అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా రెండు వేల కోట్లు కలెక్షన్లు వసూళ్లు చేసినా..అది చైనాలో చేయడం మరో విశేషం. తాజాగా బాహుబలి మరో రికార్డు కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఇండియన్ సినిమా పేరిట సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి-2’ చైనాలో కూడ విడుదలకు ముందే ఒక ఘనతను తన పేరిట రాసుకుంది.
Image result for bahubali 2
చైనాలో ఏ భారతీయ చిత్రం కూడ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది ‘బాహుబలి-2’ మాత్రం భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ..చైనా మార్కెట్లో విజయం సాధించడం కష్టమైన విషయం, ‘బాహుబలి’2’ విజయాన్ని సాదిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
Image result for bahubali 2
ఇది వరకు విడుదలైన పలు భారతీయ చిత్రాలు చైనాలో మంచి విజయాన్ని సాధించి ఉండటంతో మే 4న విడుదలకానున్న ‘బాహుబలి’పై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: