తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు, నటుడు, నిర్మాత రవిబాబు దర్శకత్వం వహించిన ‘అల్లరి’ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటూ కేరింతలు కొట్టేలా చేసింది. ఇక ఈ చిత్రంతోనే తొలిపరిచయం అయ్యారు అల్లరి నరేష్. అంతే కాదు ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు మంచి గుర్తింపు లభించింది. 

‘అల్లరి’ చిత్రంతో మంచి గుర్తిపు తెచ్చుకున్న సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుభాషిణి గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం చేశారు. సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
Megastar chiranjeevi denotes two lakh rupees to senior actress Allari Shubashini
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. సుభాషిణి ఇంటికెళ్లి రెండు లక్షల రూపాయల నగదును స్వయంగా అందజేశారు. అల్లరి సినిమాతో సుభాషిణి బాగా ఫేమస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా,‘అల్లరి’, ‘శ్రీ ఆంజనేయం’, ‘కితకితలు’, నచ్చావులే’, ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’, ‘అమరావతి’, ‘మనీ మనీ, మోర్ మనీ’, ‘సుడిగాడు’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘గుంటూరు టాకీస్’ తదితర చిత్రాల్లో సుభాషిణి నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: