రాజకీయాలు అంటే ఏమిటో తనకు తెలియదు అని అనేక సార్లు చెప్పిన మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన అద్భుత నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీలో ముఖ్యమంత్రి ‘భరత్’ పాత్రలో గంభీరంగా కనిపించిన మహేష్ ‘మేడమ్ స్పీకర్’ అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ లో చెప్పిన డైలాగ్ విన్నప్పుడల్లా మహేష్ అభిమానులు చప్పట్లు కొడుతున్నారు.
సంబంధిత చిత్రం
అయితే ఈ మేడమ్ స్పీకర్ పదాన్ని ఇలా మహేష్ గంభీరంగా పలకడం వెనుక మహేష్ బావ గల్లా జయదేవ్ ప్రభావం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం పార్లమెంట్ మెంబర్ గా కొనసాగుతున్న గల్లా జయదేవ్ పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడే సందర్భంలో ‘మేడమ్ స్పీకర్’ అన్న పదాన్ని ఎంత గంభీరంగా అన్నారు అన్న విషయాన్ని పదేపదే పరిశీలించి తాను ‘భరత్’ లో డైలాగులు చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు మహేష్. 
MAHESH IN BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇదే సందర్భంలో ఈసినిమాలోని తన పాత్రకు సంబంధించిన మరొక ఆసక్తికర విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. ఈమూవీలో తన పాత్ర లండన్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిగా కనిపించే నేపధ్యంలో తన ఇంగ్లీష్ స్లాంగ్ విషయంలో బ్రిటీష్ ఇంగ్లీష్ స్లాంగ్ లా ఉండటం కోసం బ్రిటీష్ పార్లమెంట్ లో ఆ దేశ పార్లమెంట్ మెంబర్స్ ఏవిధంగా మాట్లాడుతారు ఆ సందర్భంలో ఏ విధంగా వారి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అన్న విషయమై రీసర్చ్ చేయడానికి అనేక వీడియోలను తాను కొరటాలతో కలిపి చూసినట్లు మహేష్ అంటున్నాడు.      
MAHESH IN BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు ఈసినిమాను రెండు భాగాలుగా తీయాలని కొరటాల ఇచ్చిన సూచనకు తాను భయపడిన విషయాన్ని బయట పెడుతూ ‘భరత్’ సక్సస్ చూసిన తరువాత ఈసినిమాకు సీక్వెల్ ఉంటే బాగుండేది అన్న ఆలోచన తనకు కలుగుతోంది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఏమైనా వరస పరాజయాలతో సతమతమవుతున్న మహేష్ కెరియర్ కు మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మూవీగా ‘భరత్’ అతడి సినిమాల లిస్టు లో మిగిలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: