తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి2’.   ఎస్ ఎస్ రాజమౌళి ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు పొందింది.  ఈ చిత్రంలో కోసం హీరో ప్రభాస్ తన సమయాన్ని ఎంతో త్యాగం చేశారు.  ఐదు సంవత్సరాల వరకు ఎన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా..వాటిని సున్నితంగా తిరస్కరించారు.  ఆయన త్యాగానికి మంచి గుర్తింపు రావడయమే కాకుండా జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. 
Image result for prabhas bahubali
ప్రస్తుతం  ప్రభాస్ ప్ర‌స్తుతం ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ దుబాయ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో ఒళ్ళు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ సీన్స్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2018 చివ‌రిలో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.
radha krishna and prabhas movie goes on floors
ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు దుబాయ్‌లో నెల రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.  ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ కి రానున్నారు చిత్ర యూనిట్.  అయితే ఇప్పటికే తన సినిమాల్లో గ్యాప్ ఎక్కువగా రావడంతో ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారని తెలుసుకున్న ప్రభాస్..వెంట వెంటనే సినిమాలు పూర్తి చేసి కొద్ది గ్యాప్ లోనే థియేటర్లలో సందడి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Related image
ఈ నేపథ్యంలో జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని అంద‌రిలో అనుమానాలు నెల‌కొన‌గా, జూలైలో సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుందని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు. 
Image result for prabhas sahoo
తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా, అభిమానులందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని రాధాకృష్ణ చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: