తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది. సావిత్రి జీవితం ఆధారంగా ఓ మూవీ ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లు సావిత్రినే ఆదర్శంగా తీసుకుంటారు.  ఈ మద్య మహానటి కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Image result for 'మహానటి'

ఈ సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. సినిమాలో నటించిన నటీనటులంతా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. మిక్కీ జె.మేయర్‌ అందించిన పాటలు అలనాటి పాత పాటలకు దీటుగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

Image result for 'మహానటి'

మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడం జరిగింది. 

Image result for 'మహానటి'

ఇప్పటికే అచ్చు సావిత్రి మాదిరిగానే ఉందంటూ, కీర్తి సురేశ్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఇక మిగతా ముఖ్యమైన పాత్రల్లో సమంత .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. నాగచైతన్య .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. షాలిని పాండే నటించారు. సావిత్రి అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: