టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు "భరత్‌ అనే నేను" సినిమాతో స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ తన సత్తా చాటారు. కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించబడ్డ నాలుగవ బ్లాక్ బస్టర్ ఇది. ఆయన సినిమాలన్నీ సందేశాత్మక వాణీజ్య చిత్రాలే.  

bharat ane nenu images కోసం చిత్ర ఫలితం

పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ముఖ్యమంత్రి పాత్రలో నిండుగా అందంగా కనిపించి, ఆకట్టుకున్నారు. "మనం సమాజంలో నివసిస్తున్నాం.. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి" అంటూ సందేశం ఇస్తూ వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలుకూడా అందుకుంది.


ఈ చిత్రం విదేశాల్లో అద్భుతమైన వసూళ్లు రాబడుతోందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. "విదేశాల్లో మహేశ్‌బాబు సమ్మోహనం అంతర్జాతీయ సినీ మార్కెట్‌ లో తుపాను" సృష్టించిందంటూ ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూరప్‌, ఆఫ్రికా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల వసూళ్లను ట్వీట్‌ చేశారు. ఈ సినిమా తొలివారంలో ఉత్తర అమెరికాలో $ 3.015 మిలియన్‌ డాలర్లు, ఆస్ట్రేలియా + న్యూజిలాండ్‌ లో $ 535,000 డాలర్లు, యూరప్‌ + యూకే లో $ 350,000 డాలర్లు, ఆఫ్రికా + మలేషియా + సింగపూర్‌, తదితర ప్రాంతాల్లో $ 150,000 డాలర్లు, గల్ఫ్‌ లో $ 600,000 డాలర్లు మొత్తం $ 4.65 మిలియన్ డాలర్లు (మొత్తం రూ.31.04 కోట్లు) రాబట్టినట్లు చెప్పారు.
bharat ane nenu images కోసం చిత్ర ఫలితం
ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ₹ 161.28 కోట్లు గ్రాస్‌ రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" తర్వాత అతితక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా భరత్ అనే న్ ఏను రికార్డు సృష్టించింది.

koratala siva images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: