ఎన్నాల్లో వేచిన ఉదయం..ఈనాడే నిజమవుతుంటే..అన్నట్లు  రెండు సంవత్సరాలు గా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబుకి ‘భరత్ అనే నేను ’ మంచి విజయం సాధించింది.   ‘శ్రీమంతుడు’ లాంటి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకొని..‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలు చేయడం ఆయన కెరీర్ కి బాగ నష్టం తెచ్చి పెట్టింది.  అంతకు ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు లాంటి భారీ డిజాస్టర్ తర్వాత పలు విమర్శల పాలైన మహేష్ బాబు..కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ లాంటి మంచి సినిమాలో నటించారు. కానీ వెంటనే ‘బ్రహ్మాత్సవం’ లాంటి ఫెయిల్యూటర్ మూటకట్టుకున్న మహేష్ స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ తో ‘స్పైడర్’ లాంటి సైబర్ క్రైమ్ కి సంబంధించిన సినిమా లో నటించాడు.
Related image
అయితే మహేష్ బాబు సినిమాలంటే మంచి మసాలతో పాటు, కామెడీ, యాక్షన్ ఆశిస్తున్న ఆడియన్స్ సైబర్ క్రైమ్ గోళ అస్సలు నచ్చలేదు..దాంతో ఈ సినిమా కూడా ఫెయిల్ కావడమే కాదు..మహేష్ కెరీర్ లో భారీ నష్టాలు కూడా తెచ్చిపెట్టింది.  దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ మహేష్ తనకు అచ్చొచ్చిన కొరటాల దర్శకత్వంలోనే నటించాలని నిర్ణయించుకున్నారు.   మహేశ్ బాబు హీరోగా ఈ నెల 20వ తేదీన 'భరత్ అనే నేను' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. 
Image result for BHARATH ANE NENU STILLS
మొదటి సారిగా మహేష్ బాబు ఫుల్ లెన్త్ పొలిటీషియన్ గా కనిపించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ రావడంతో..తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.ఇక వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 73.9 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది తాజా సమాచారం.
Related image
అమెరికాలో 3 మిలియన్ డాలర్లకి పైగా రాబట్టింది.  అంతే కాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోను భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ‘భరత్ అనే నేను’ లో మహేష్ సరసన కైరా అద్వాని నటించింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: