రికార్డుల కలక్షన్స్ క్రియేట్ చేస్తూ 'భరత్‌ అనే నేను' బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌ నోవాటెల్‌ లో నిన్న ఈమూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా పోసాని కృష్ణ మురళి స్పీచ్ ఈఈవెంట్ కు ఆకర్షణగా మారింది. తనమేనల్లుడు అయిన కొరటాల శివ గురించి కొన్నివిషయాలు చెప్పడంతో పాటు కొరటాలను టార్గెట్ చేస్తూ పోసాని వేసిన జోక్స్ కు ఆ ఈవెంట్ కు వచ్చిన వారంతా విరగబడి నవ్వారు. 
శివ కథలు చాలా మంది కాజేశారు
కొరటాల ఇండస్ట్రీకి వచ్చిన తరువాత చాలడబ్బులు గణించాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారని అయితే కొరటాల పోగొట్టుకుంది ఎంతో తనకు తెలుసు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు పోసాని. కొరటాల వ్రాసిన చాలకథలను చాలామంది రచయితలు అతడికి తెలియకుండానే కాజేశారు అని అంటూ అలాంటి విషయాలు జరగకుండా ఉంటే కొరటాల శివ ఈపాటికి పదిసినిమాలను తీసి ఉండేవాడు అన్న షాకింగ్ కామెంట్స్ చేసాడు పోసాని.  
POSANI MURALI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇదేసందర్భంలో మరో ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ పోసాని తనపెళ్లి చూపులకు తనకు తోడుగా కొరటాలను తీసుకువెళ్ళిన విషయాన్ని వివరిస్తూ కొరటాలకు నచ్చిన అమ్మాయినే తాను పెళ్ళి చేసుకున్నానని చిన్నప్పటి నుంచి తాను ఎత్తుకుని పెంచిన వ్యక్తి కొరటాల అంటూ కొరటాల పై తనకు ఉన్నప్రేమను బయటపెట్టాడు. కొరటాల డైలాగులకు తాను వ్రాసే డైలాగులకు తేడాను వివరిస్తూ తాను రాజకీయ నాయకులను బూతులు తిడుతూ డైలాగులు వ్రాస్తే కొరటాల రాజకీయ నాయకులను ‘మొగాళ్ళు’ గా తయారుచేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు అంటూ కొరటాల పై సెటైర్ వేసాడు పోసాని. 
సగం వీడిమీద నమ్మకం, సగం నా పెళ్లాం మీద నమ్మకం
మహేష్ బాబు అందం గురించి మాట్లాడుతూ తన కొడుకు మూడేళ్ల వయసు నుండే మహేష్ బాబు ఫ్యాన్ అయ్యాడు అనిచెపుతూ తనకొడుకు వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవాడు అవుతున్నట్లు కనిపిస్తుంటే మహేష్ వయసు పెరుగుతున్న కొద్ది చిన్నవాడుగా కనిపిస్తూ ఉండటం ఆశ్చర్యంగా ఉంది అని పోసాని జోక్ చేయగానే ఆఈవెంట్ కు వచ్చిన అందరు తెగ నవ్వుకున్నారు. ఇక ఈసినిమాతో పోసాని కొడుకు అసిస్టెంట్ డైరక్టర్ గా పరిచయమైన విషయాన్ని బయటపెడుతూ లాస్ ఏంజెల్స్ లో ఫిలింమేకింగ్ కోర్స్ ను నేర్చుకున్న తనకొడుకు మొదటి మూవీ కూడ బ్లాక్ బస్టర్ హిట్ కావడం తనకు ఆనందాన్ని ఇస్తోంది అంటూ పోసాని కూడ తనవారసుడి రాకను బహిరంగంగా ప్రకటించాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: