ఈ మద్య తెలుగు బుల్లితెరపై యాంకర్ల హవా బాగా పెరిగిపోయింది.   జబర్ధస్త్ కామెడీ షో తో అనసూయ, రష్మిలు ఏకంగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ బీజీగా మారిపోయారు.  ‘పటాస్’ ప్రోగ్రామ్ తో శ్రీముఖి కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో చాలా మంది అభిమానుల‌ను సంపాందించింది. ఎప్పుడూ హుషారుగా చలాకీగా కనిపించే శ్రీముఖి తన మాటలతో పంచ్ లు విసురుతూ.. మాస్ డైల‌గుల‌తో అభిమాల‌నుల‌ను అల‌రిస్తుంది. 
Image result for anasuya reshmi
అయితే శ్రీముఖి కూడా కొన్ని సినిమాల్లో నటించినా తనకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు..పటాస్ ప్రోగ్రామ్ తో ఈ అమ్మడికి తెగ పాపులారిటీ వచ్చింది.  ఆ మద్య కొన్ని షోలో కాంట్రవర్సీలు చేసిన శ్రీముఖిపై విమర్శలు కూడా వచ్చాయి.  ఏది ఏమైనా బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి కి యాంకర్ సుమ కనకాల పెద్ద షాక్ ఇచ్చింది. 
Image result for srimukhi
వివరాల్లోకి వెళితే..ఓ ఎంటర్‌టైన్ ప్రొగ్రాంలో  సుమ పాల్గొన్నారు..ఆ సమయానికి శ్రీముఖి చేసిన ప్రాంక్ కాల్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా చేసింది.  సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను. ఎంతో కష్టపడితే కానీ మీ ఫోన్ నెంబర్ దొరికిందమ్మా...నువు ఊ అంటే ఒక్కసారి మీ స్టార్ మహిళా ప్రాగ్రామ్ కి వచ్చిపోతా అంటూ చాలా సేపు ఇబ్బంది పెట్టింది.
Image result for star mahila
నేను చాలా బిజీగా ఉన్నాను..అని సుమా చెబుతుంటే..అవసరమైతే మీ కాళ్లు పట్టుకుంటా..ప్లీజ్ ఒక్కసారి చాన్స్ ఇస్తారా అంటూ శ్రీముఖి చెప్పడంతో..వెంటనే సుమకి చిర్రెత్తుకొచ్చి కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: