ప్రతికూల విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో మెగాఫ్యామిలీ వేసే ఎత్తుగడలలో అల్లుఅరవింద్ వ్యూహాత్మక సలహాలు కీలకపాత్ర వహిస్తాయి అని చాలామంది అభిప్రయపడుతూ ఉంటారు. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ వివాద విషయంలో అల్లుఅరవింద్ సలహాతోనే   మెగాఫ్యామిలీ ఈవిషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిందని కొంతమంది అభిప్రాయం. 
సంబంధిత చిత్రం
ఇప్పుడు అల్లుఅరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవే అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇండస్ట్రీలో తలెత్తిన పరిణామాలు తీసుకున్ననిర్ణయాల నేపథ్యంలో ‘సూర్య’ ను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు చేసే ప్రచారానికి కొన్ని టీవీ ఛానెలలు సప్పోర్ట్ ఇస్తాయి అన్నది అరవింద్ అనుమానం అని అంటున్నారు. 
NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే పవన్ తనపై కొన్ని ఛానెల్స్ వ్యతిరేకంగా కుట్ర చేశాయని పేర్కొంటూ పోరాటం చేస్తున్న ఒకప్రముఖ టీవీ ఛానల్ మొన్నరాత్రి  ‘నా పేరు సూర్య’ ఫంక్షన్ ను  లైవ్ లో ప్రసారం చేసిన విషయం తనకు తెలియదు అని అరవింద్ బయటకు చెపుతూ ఉన్నా ఆప్రముఖ ఛానెల్ పై ఉన్నభయంతో ఆఖరినిమిషంలో అరవింద్ ‘సూర్య’ ఫంక్షన్ లైవ్ లో ప్రసారం చేసే అవకాసం ఆఛానల్ కు ఇచ్చాడు అన్నగాసిప్పులు గుప్పుమంటున్నాయి. దీనితో అరవింద్ పైకి ఒకలా చెపుతూ లోలోపల మరోలా వ్యవహరిస్తూ రివర్స్ గేర్ లో ‘నాపేరు సూర్య’ విషయమై ప్రవర్తిస్తున్నాడు అన్నకామెంట్స్ వస్తున్నాయి.
సంబంధిత చిత్రం
ఇదిచాలదు అన్నట్లుగా పవన్ కు తెలుగుదేశ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ గ్యాప్ ‘నాపేరు సూర్య’ కలక్షన్స్ పై స్పష్టంగా కనిపించే ఆస్కారం ఉంది అనిఅంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టాప్ హీరోల పెద్ద సినిమాలకు తెల్లవారుఝాము 5 గంటల నుంచి షోలు వేసుకునే అలవాటు ఉంది. ‘అజ్ఞాతవాసి’ ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాలకు ఈప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలసులువుగా అనుమతులు ఇచ్చింది. అయితే ఈవిషయంలో అయిదు గంటల నుంచి షోలు అడుగుతూ 'నా పేరు సూర్య' పెట్టుకన్న దరఖాస్తు అలాపెట్టిన చోటే ఉందని తెలుస్తోంది. ఈసినిమా విడుదలకు ఇక కేవలం మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈదరఖాస్తు పెట్టిన చోటే ఉండటంతో ఈసినిమాకు అనుమతులు ఇవ్వకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒకప్రముఖ ఛానల్ చక్రం తిప్పుతోంది అన్న గాసిప్పులు ప్రస్తుతం హడావిడి చేస్తున్నాయి. దీనితో అరవింద్ అత్యుత్సాహంతో చేసిన కామెంట్స్ రివర్స్ పంచ్ ఇచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: