మిర్చి సినిమాతో రైటర్ నుండి డైరక్టర్ గా ప్రమోట్ అయిన కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో హిట్ అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ. ఈ సినిమా తో డబుల్ హ్యాట్రిక్ కు శుభారంభం పలికాడు.


ఈ సినిమా తర్వాత కొరటాల శివ మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. బన్ని కూడా నా పేరు సూర్య సినిమా తర్వాత ఎలాంటి కమిమెంట్ ఇవ్వలేదు. దాదాపు కొరటాల శివతోనే బన్ని సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమా తర్వాత మాత్రం మళ్లోసారి మిర్చి కాంబినేషన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడట కొరటాల శివ.


మిర్చి సినిమా ప్రభాస్ అంతకుముందు సినిమాల కన్నా హయ్యెస్త్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.


ఇక ఈ సినిమా కూడా పూర్తయ్యాక కొరటాల శివతో సినిమా ఉంటుందని అంటున్నారు. కొరటాల శివ సినిమ అంటే మళ్లీ హిట్ సినిమా అన్నట్టే. కమర్షియల్ గానే స్టార్ సినిమాల్లో ఓ మంచి మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడుతున్న కొరటాల శివ సినిమా అంటే ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: