ఒకప్పుడు టాప్ హీరోలు అందరితో సినిమాలు తీసిన అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ కు టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరుండేది. అయితే అశ్వినీ దత్ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ తో మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘కంత్రీ’ ‘శక్తి’ సినిమాలను తీసి చాల ఆర్ధికంగా నష్టపోయాడు అన్నవార్తలు ఉన్నాయి. ఆ తరువాత జూనియర్ తో మరో సినిమాను తీయాలని అశ్వినీదత్ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలంకాలేదు అన్న వార్తలు ఉన్నాయి.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అశ్వినీదత్ కు తనవల్ల జరిగిన నష్టాన్ని మరొక విధంగా తీరుస్తున్నాడు. ఈరోజు జరగబోతున్న ‘మహానటి’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా జూనియర్ రాబోతున్నాడు. ‘మహానటి’ సావిత్రి జీవితం పై తీసిన మూవీ ఈనెల 9న విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ పై హైక్ క్రియేట్ చేయడానికి జూనియర్ ఈ ఫంక్షన్ కు అతిధిగా రాబోతూ ఉండటం హాట్ న్యూస్ గా మారింది.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి జూనియర్ చేత అశ్వినీదత్ ఈ ‘మహానటి’ సినిమాలో నందమూరి తారకరామారావు పాత్రను జూనియర్ చేత నటింపచేయడానికి చాలప్రయత్నాలు చేసాడు. అయితే ఆప్రయత్నాలు ఏమి సఫలం కాలేదు. ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని జూనియర్ ఈరోజు ‘మహానటి’ ఫంక్షన్ కు అతిధిగా రావడం ద్వారా తన ఋణం తీర్చుకుంటున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘మహానటి’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, లుక్ లు, టీజర్లు ఇలా అన్నింటి పై పాజిటివ్ టాక్ వచ్చినా ఈమూవీ బిజినెస్ అశ్వినీదత్ ఊహించుకున్న స్థాయిలో జరగడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు జూనియర్ రాకతో ఈమూవీకి బయ్యర్లలో క్రేజ్ ఏర్పడి మంచి బిజినెస్ జరిగితే అది జూనియర్ రాకతో ఏర్పడిన క్రేజ్ అనుకోవాలి. టాప్ హీరోల సినిమాల హడావిడి ‘సూర్య’ తో ముగిసిపోయిన తరువాత వస్తున్న ఈమూవీ సక్సస్ అయితే టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు వచ్చే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: