గత రెండేళ్లుగా నాచురల్ స్టార్ నాని సినిమా అంటే చాలు అది పక్కా హిట్ అన్న పరిస్థితి ఉంది. ఎవడే సుబ్రమణ్యం నుండి ఎం.సి.ఏ వరకు నాని రేంజ్ పెంచుకుంటూ వచ్చాయి ఆయా సినిమాలు. ఇక లేటెస్ట్ గా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మాత్రం నిరాశ పరచింది. 2018 కూడా నాని సక్సెస్ మేనియా కొనసాగుతుంది అనుకున్న వారికి షాక్ తగిలింది.


మేర్లపాక గాంధి డైరక్షన్ లో ఇదవరకు వచ్చిన ఎక్స్ ప్రెస్ సినిమాలకు భిన్నంగా నాని కాస్త మాస్ టచ్ ఇస్తూ చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా ద్వారా నాని మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్మాల్సిందే. ఇలానే మరో ఫ్లాప్ పడితే నాని సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


ప్రస్తుతం నాని నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే విక్రం కె కుమార్ తో సినిమా చేయాల్సి ఉన్నా ఇప్పుడున్న టైంలో ప్రయోగాలు వద్దని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.


నాని హిట్ సినిమాలను చూస్తే తను లవర్ బోయ్ గా నాచురల్ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి కాదని కమర్షియల్ హంగులకు పోతే కృష్ణార్జున యుద్ధం ఫలితమే రిపీట్ అవుతుంది. మరి నాని మళ్లీ తన కెరియర్ మీద జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ లేదంటే వెనకపడే అవకాశం లేకపోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: