ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన 'అవేంజర్స్ : ఇన్ఫినిటీ' వార్ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు యూఎస్ఏతో పాటు ఇటు ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం అద్భుతమైన ఓపెన్సింగ్స్ సాధించింది.  అటు యూఎస్ఏతో పాటు ఇటు ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం అద్భుతమైన ఓపెన్సింగ్స్ సాధించింది. ఇండియాలో ఈ సినిమా ఓపెనింగ్ డే రూ. 61.58 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.  మార్వెల్ సంస్థ నుండి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ఇది. చిత్రం విడుదల ముందు నుండే చిత్ర బృందం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
Avengers: Infinity Wars team special message for Indian Marvel fans
ఈ చిత్రం తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా 41 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రాబట్టింది. ఒక్క ఆమెరికాలోనే 250 మిలియన్‌ డాలర్‌లు (పదహారు వేల కోట్ల రూపాయలు) ఆర్జించింది. గతంలో మరే హాలీవుడ్‌ చిత్రం ఇంత భారీ వసూళ్లు సాధించలేదు. స్టార్‌ వార్స్‌ ద ఫోర్స్‌ అవేకెన్స్‌, జురాసిక్‌ వరల్డ్‌, ద బ్లాక్‌ పాంథర్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7 లాంటి చిత్రాల రికార్డులన్నీ అవేంజర్స్‌ ఇన్ఫినిటీ దెబ్బకు చెదిరిపోయాయి. ఊహాతీత ప్రదేశాలు, అద్భుత కాల్పనిక పాత్రలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తోందీ సినిమా. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రూసో సోదరులు ఈ చిత్రాన్ని రూపొందించారు.
Image result for avengers-infinity-war-
ఇండియాలోని మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ అభిమానం ఇంక్రెడబుల్. మీ ఫేవరెట్ సూపర్ హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించే సినిమా ఇది. మీ అందరినీ ఈ చిత్రం ఎంతగానో ఎంటర్టెన్ చేస్తుంది అని తమ సందేశంలో పేర్కొన్నారు. 2 వేల స్క్రీన్‌లలో తెరపైకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే 94 కోట్లరూపాలకు పైగా వసూళ్లు సాధించింది. తొలి రోజు, తొలివారం మూడు రోజుల్లో ఇంత వసూళ్లు రాబట్టేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలే చెమటోడుస్తుంటారు.
Image result for avengers-infinity-war-
తెలుగు చిత్రంపై ఈ హాలీవుడ్‌ సినిమా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మల్టిఫ్లెక్సుల థియేటర్‌లలో అవేంజర్స్‌ ఎదురులేకుండా దూసుకెళుతోంది. పిల్లలు, పెద్దలంతా అవేంజర్స్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఎవాన్స్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: