ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేడు (మే1) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికలే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ..సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ వస్తున్నారు చిత్ర యూనిట్.  కాగా నేడు ఆడియో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. 
Image result for mahanati
ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆల్బం ఆవిష్కరించనున్నారు. 'మహానటి' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం గతంలో దర్శక నిర్మాతలు ఎన్టీఆర్‌ను సంప్రదించారు. తాత పాత్రలో చేయడానికి ఎన్టీఆర్ నిరాకరించారు.  నాగ్ అశ్విన్ కోరికను సున్నితంగా తిరస్కరించిన ఎన్టీఆర్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావాలనే వారి ఆహ్వానానికి వెంటనే ఒకే చెప్పారు. టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క బయోపిక్‌లో ఒకటిగా 'మ‌హాన‌టి' చిత్రాన్ని పేర్కొంటున్నారు.

వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇందులో సమంత ఫిల్మ్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె వెంట ఉండే ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇంకా దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Image result for mahanati
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్.


మరింత సమాచారం తెలుసుకోండి: