ప్రిన్స్ మహేష్ కెరీర్లో సూపర్ హిట్స్ సంఖ్యకు మించి డిజాస్టర్లు కూడ ఉన్నాయి. అయితే తాను నటించన సినిమాల జాయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే అందులోమహేష్ కు నాలుగు డిజాస్టర్లు ఉన్నాయి. ఈఫ్లాప్స్ వల్ల మహేష్ ఎంతో మానసికంగా నలిగిపోయాడు అన్నవార్తలు కూడా ఉన్నాయి. అందువల్లనే ఈమధ్య మహేష్ ఒకప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అందరూ తనను సూపర్ స్టార్ అంటారని కానీ తన లాంటి స్టార్ కు నాలుగేళ్లలో రెండుసార్లు లైఫ్ ఇచ్చిన వ్యక్తి దర్శకుడు కొరటాల అంటూ నిజాయితీగా మాట్లాడాడు. దీనితో మహేష్ లాంటి సూపర్ స్టార్ ఒక దర్శకుడి గురించి అలా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 
MAHESH BABU LATEST PHOTOS IN BHARATH ANE NENU PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈనేపధ్యంలో ఒకమీడియా సంస్థ ప్రతినిధి ఇదేవిషయం కొరటాల దగ్గర ప్రస్తావిస్తే కొరటాల మహేష్ ఫ్లాప్స్ పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన పై గౌరవంతో మహేష్ అన్న మాటలను అంగీకరించలేనని అన్నాడు. అసలు మహేష్ బాబుకు అలా డిజాస్టర్లు ఎందుకు వచ్చాయనే విషయమై కొరటాల తన అభిప్రాయం చెపుతూ మహేష్ తన సినిమాల్లో ఏరెండు సన్నివేశాలూ ఒకలా ఉండాలని కోరుకోడని చాలా వైవిధ్యం కోరుకుంటాడని ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా ఉండాలని పదేపదే తన దర్శకులకు చెపుతూ ఉంటాడని చెపుతూ సన్నివేశాల విషయంలోనే ఇలా ఆలోచించే మహేష్ సినిమాల విషయంలో ఇంకెలా ఆలోచిస్తాడో అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు కొరటాల. 
సంబంధిత చిత్రం
అంతేకాదు  ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు ఉంటాయని అలాంటి పరిస్థుతలలో మహేష్ కు ఫ్లాప్స్ వచ్చి ఉంటాయి అనిఅంటూ ఆఫ్లాప్స్ ను విపరీతంగా విశ్లేషిస్తూ మహేష్ లాంటి టాప్ హీరో పై బురద జల్లడం అన్యాయం అంటూ కొరటాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  అంతేకాదు మంచి కథను మరింత గొప్ప స్థాయికి  తీసుకువెళ్ళగల నటుడు ఒక్క మహేష్ మాత్రమే అంటూ ఆకాశానికి ఎత్తేసాడుకొరటాల. 
సంబంధిత చిత్రం
ఇది ఇలాఉండగా మరోమూడు రోజుల్లో అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య"   భారీ స్థాయిలో విడుదలకానున్ననేపధ్యంలో  సినిమా నుంచి రాబోయే పోటీని తట్టుకోవడానికి ‘భరత్’ టీమ్ ఒక వినూత్న ఆలోచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు ‘నాపేరు సూర్య’ విడుదల కానున్న 4వ తేదీ నుంచే ‘భరత్’ కు అదనంగా కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా కొరటాల మహేష్ లకు ఎంతో ఇష్టమైన హోలీ ఫైట్ సీన్ ను 4వ తేదీ నుంచి ‘భరత్ అనే నేను’ సినిమాలో చూపించబోతున్నారు. ఈనిర్ణయం వల్ల బాక్సాఫీస్ వద్ద సూర్యకు పోటీగా ‘భరత్’ మరింత స్ట్రాంగ్ గా నిలబడుతుందని భరత్ టీం ఆలోచన అని అంటున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: