టాలీవుడ్ ప్రముఖలు కొంత  సమావేశం నిర్వహించి మీడియా ను బ్యాన్ చేయాలని నిర్ణయించునట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సినీ పెద్దలు అంటున్నారు, అయితే సినిమా ను వేరే పద్ధతుల్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలో మాత్రమే డిస్కస్ జరిగినట్లు చెబుతున్నారు. అయితే టాలీవుడ్ పెద్దలకు మరియు మీడియా ప్రహతినిధులకు నిన్న సమావేశం జరిగింది. దీనితో వివాదం ఒక కొలిక్కి వచ్చే మార్గం కనిపిస్తుందని తెలుస్తుంది.

Image result for tollywood meeting

అయితే ఇప్పుడు ఇక్కడకు వచ్చినవి జర్నలిస్ట్ లు సంఘాలు కాబట్టి, మీడియా హెడ్స్ తో కూడా మరో సమావేశం త్వరలో నిర్వహించాలని డిసైడ్ చేస్తూ సమావేశం ముగించారు. అయితే ఆ సమావేశం ఎప్పుడు అన్నది కూడా డిసైడ్ చేయలేదు. ప్రస్తుతానికి కలిసారు. ఏమైనా వుందా? అని వీరు అడిగారు. అబ్బే అదేం లేదు అని వారు చెప్పారు. అయినా అదే మాట చానెళ్ల హెడ్ లకు కూడా చెప్పాలన్నారు.

Image result for tollywood meeting

అంతే అక్కడితో సరి. దీంతో దాదాపు గత రెండు వారాలుగా ఈ దిశగా జరుగుతున్న గడబిడ అంతా ప్రస్తుతానికి ముగిసింది అనే అనుకోవాలి. అయితే ఈ చర్చలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయి అన్నది ప్రస్తుతానికి సందేహమే. మీడియా సపోర్ట్ లేకపోతే సినీ ఇండస్ట్రీ కి నష్టమే అలాగే టాలీవుడ్ న్యూస్ లేకపోతే మీడియా కు రేటింగ్స్ రావని చెప్పొచ్చు. కాబట్టి ఇద్దరు కలిసిపోవాలని చాలా మంది సూచిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: