నిన్న రాత్రి జరిగిన ‘మహానటి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భావోద్వేగంతో జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారకరామారావు గురించి చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీలో తనకు సీనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రను చేసే అవకాశం తనకు వచ్చినా తాను వెంటనే ఒక్క నిముషం కూడ ఆలోచించకుండా తిరస్కరించాను అన్న విషయాన్ని బయట పెట్టాడు జూనియర్.

అంతేకాదు తనకు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను చేయగలిగిన అర్హత లేదని తన అభిప్రాయం అని అంటూ అటువంటి మహా వ్యక్తి పోషించగల వ్యక్తికి చాల ధైర్యం ఉండాలి అంటూ వ్యూహాత్మకంగా కామెంట్స్ చేసాడు జూనియర్. దీనితో ఈ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది జూనియర్ తనకు అర్హత లేదని చెపుతూనే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో సాహసం చేస్తున్నాడు అంటూ వ్యూహాత్మకంగా కామెంట్స్ చేసాడా అన్న సందేహాలను కొందరు వ్యక్త పరుస్తున్నారు.

ఇదే సందర్భంలో ‘మహానటి’ సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమె గొప్పతనం గురించి మాట్లాడే అర్హత తనకు ఎన్ని జన్మలు ఎత్తినా రాదు అంటూ సావిత్రి పై తన అభిమానాన్ని వ్యక్త పరిచాడు జూనియర్. సావిత్రి ఎలా చనిపోయారు అనే విషయం కంటే ఆమె ఎలా బ్రతికారు అని చెప్పే గొప్ప చిత్రం ‘మహానటి’ అని చెపుతూ ఈసినిమాలో సావిత్రి జీవితంలోని చీకటి కోణాలు ఉండవు అన్న సంకేతాలను నిర్మాతల తరఫున జూనియర్ ఇచ్చాడు.   

గొప్పవాళ్ళు భౌతికంగా మన నుంచి దూరం అయిపోయినా వారి గొప్పతనం ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని అటువంటి గొప్ప వ్యక్తి జీవితం పై తీసిన సినిమాలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేశ్ కు ఎదో జన్మలో సావిత్రితో అనుబంధం ఉంది అన్న విషయాన్ని వేదాంత ధోరణిలో కామెంట్ చేసాడు. తెలిసిన వ్యక్తి గురించి మన ముందు చూపించడం అంటే అది నటన కాదని ఆపాత్రలో జీవించవలసి ఉంటుందని జూనియర్ అభిప్రాయపడుతూ తాను ఎందుకు తన తాత పాత్రను తిరస్కరించాడో అన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెప్పడం బట్టి ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తున్న బాలయ్యకు సూచనగా ఈవిషయాలు చెప్పాడా అన్న కామెంట్స్ కూడ  వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: