వివాదాల జోలికి వెళ్ళకుండా వివాదాస్పద విషయాల గురించి మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడడు నాగార్జున. అయితే అలాంటి వ్యక్తి నిన్న జరిగిన మహానటి ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం లేదు అన్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని నాగ్ చేసిన కామెంట్స్ ఉన్నాయని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

మహానటి సావిత్రితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఉద్వేగభరితంగా గుర్తుకు చేసుకుంటూ ఈసినిమాకు నిర్మాతలుగా స్వప్న ప్రియాంకదత్ లు తమ పాత్రలను నిర్వహించినా ఈసినిమాలో 20 మంది  మహిళలు టెక్నీషియన్స్ గా వర్క్ చేయడం చూస్తుంటే మహిళలు ఎక్కడ వెనకపడిపోతున్నారు అని ప్రశ్నించాడు నాగార్జున.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిస్థుతులు మారుతున్నాయని మహిళలకు ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతోంది అని అంటూ పరిస్తుతులతో ఇండస్ట్రీ వర్గాలు కూడ మారవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా మహిళల పై ఇండస్ట్రీ వర్గాలు చిన్నచూపు చూస్తే ప్రమాదం ముంచుకు వస్తుంది అన్న సంకేతాలు ఇచ్చాడు నాగ్. తన తండ్రి అక్కినేనికి సావిత్రి అంటే ఎంతో గౌరవం అని చెపుతూ అటువంటి సినిమాలో తన కోడలు సమంత నటించడం తన కుటుంబానికి లభించిన గౌరవంగా అని భావిస్తాను అంటూ కామెంట్స్ చేసాడు. 

నాగార్జున అన్న మాటలు స్పష్టంగా కాకపోయినా అంతర్లీనంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వివాదం పై ఉన్నాయి అంటూ నాగ్ స్పీచ్ వెనుక అర్ధాలను వెతుకుతున్నారు. జూనియర్ నాగార్జున లాంటి టాప్ హీరోలు మహానటి ఫంక్షన్ కు అతిధులుగా వచ్చిన నేపధ్యంలో ఈసినిమాకు మార్కెటింగ్ పరంగా ఎదురౌతున్న సమస్యలు తీరే అవకాశం ఉంది అని అంటున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సావిత్రికి ప్రభుత్వపరంగా ఎటువంటి సత్కారాలు గౌరవాలు లభించకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలలో సావిత్రి ఎప్పుడు ‘మహానటి’.. 


మరింత సమాచారం తెలుసుకోండి: