తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ప్రభాస్ ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు.  ఆ తర్వాత నుంచి వరుస విజయాలతో ప్రబాస్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో రాజమౌళి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

Saaho prabhas photos leaked

బాహుబలి 2 చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాల తరువాత కొంత గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు హై రేంజిలో ఉన్నాయి. ప్రసుత్తం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అబుదాబి, దుబాయ్‌లో జరుగుతోంది. ప్రభాస్ మీద చిత్రీకరిస్తున్న సీన్లకు సంబంధించిన ఫోటోస్ లీక్ అయ్యాయి. కొన్ని క్షణాల్లోనే ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

Image result for prabhas sahoo photos

ఇది ప్రభాస్ కు 19వ చిత్రం కాగా, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ ను ప్రభాస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఓ హైఎండ్ బైక్ పై కూర్చుని ఉన్న ప్రభాస్ స్టయిలిష్ గా, డేరింగ్ గా కనిపిస్తున్నాడని వీటిని చూసిన వారంటున్నారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.  ప్రభాస్ మీద హై ఆక్టేన్ బైక్ స్టంట్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.   


ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఎవలీన్ శర్మపై కూడా యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ మూవీల్లో ది బెస్ట్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటో ఒకటి ఇటీవలే ఆన్ లైన్ లో లీక్ అయింది. ప్రభాస్ పోస్టు చేసిన లేటెస్ట్ అఫీషియల్ స్టిల్స్ ను మీరూ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: