పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వడంతో పవన్ స్థాయిలో యూత్ ను ఆకర్షించగల హీరో ఎవరు అనే విషయమై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. మెగా అభిమానులు పవన్ వారసుడుగా చరణ్ టాలీవుడ్ ఎంపరర్ అవుతాడు అని ప్రచారం చేస్తున్నా యూత్ ఐకాన్ గా ఎదగగల శక్తి చరణ్ కు కన్నా యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఉంది అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. 
VIJAY DEVARAKONDA LATEST PHOTOS IN TAXI WALA కోసం చిత్ర ఫలితం
దీనికి కారణం ప్రస్తుతం యూత్ లో విజయ్ దేవర కొండ అంటే ఒక సంచలనం. తనకంటూ క్రియేట్ చేసుకున్న ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో విజయ్ యంగ్ హీరోల రేస్ లో పరుగులు తీస్తున్నాడు. పవన్ క్రేజీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన రోజులలో నటించిన ‘బద్రీ’ ‘ఖుషీ’ సినిమాలో పవన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ని క్రియేట్ చేసుకుని అప్పటి యూత్ కు ఐకాన్ గా మారాడు. 
VIJAY DEVARAKONDA LATEST PHOTOS IN TAXI WALA కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు విజయ్ దేవర కొండ నటిస్తున్న సినిమాలలో అతడు అనుసరిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఒకనాటి పవన్ సినిమాల ప్రభావం కనిపిస్తోంది అంటూ కొందరు విశ్లేషకులు ఒక సరికొత్త వాదాన్ని తెర పైకి తెస్తున్నారు. అయితే ఈ పోలికలు మెగా అభిమానులకు పెద్దగా నచ్చని విషయం అయినా పవన్ కు వీరాభిమానులు ఏర్పడిన విధంగా భవిష్యత్ లో విజయ్ దేవర కొండకు కూడ వీరాభిమానులు ఏర్పడే అవకాసం స్పష్టంగా ఉంది అని అంటున్నారు. 
VIJAY DEVARAKONDA LATEST PHOTOS IN TAXI WALA కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఈనెల 18న విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆమూవీ నిర్మాతలు విడుదల చేసిన టీజర్ లో విజయ్ దేవర కొండ తన ఇంటికి వచ్చిన పిల్లల కోరిక పై మందు సిగరెట్ తాగనని సంకేతాలు ఇస్తూ పిల్లలచేత తన ఇంటిలోని మందు బాటిల్స్ ను బయటపడవేయడం చూస్తూ ఉంటే విజయ్ దేవర కొండ తాను బూతు సినిమాల హీరోను మాత్రమే కాదని తాను అన్ని వర్గాలకు నచ్చే హీరోను అని వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలను చూస్తుంటే ఈ యంగ్ హీరో రానున్న రోజులలో టాప్ యంగ్ హీరోల రేస్ లోకి ఎంటర్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: