హాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలిగిపోయిన హీరో జాకీ చాన్ అంటే తెలియని వారు ఉండరు.   ఎంతటి రిస్క్ సీన్లు అయినా అవలీలగా చేసే యాక్షన్ హీరో జాకీ చాన్ ఈ మద్య కాస్త సినిమాలు తగ్గించారు.  ఇక జాకీ చాన్ చిత్రం రిలీజ్ అయ్యిందంటే..చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు ఎంతో థ్రిల్లింగ్ గా వీక్షించే వారు..అందుకే ప్రపంచ స్థాయిలో ఆయనకు అంత మంచి పేరు వచ్చింది.  ఇదిలా ఉంటే జాకీ చాన్ కుమార్తె ఎట్టా ఎన్‌  ఇప్పుడు రోడ్డున పడింది..ఆమె  విడుదల చేసిన వీడియో చూస్తే మీ మనసు చలించక మానదు.

దయనీయమైన స్థితిలో హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జికింద ఆమె జీవిస్తోంది. తన పరిస్థితి వెల్లడిస్తూ ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కనీసం ఇల్లు కూడా లేకుండా హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జిల కింద తలదాచుకుంటున్నది.తన గర్ల్‌ఫ్రెండ్ ఆండీతో కలిసి ఓ బ్రిడ్జి కింద జీవిస్తున్నట్లు ఎట్టా ఎన్‌ వెల్లడించారు. ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తాను ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులే అని ఎట్టా ఎన్‌ ఆరోపించారు. నా తల్లిదండ్రులకు ‘హోమోఫోపిక్ పేరెంట్స్' (స్వలింగ సంప్కకులను అసహ్యించుకునే వారు).
తన గర్ల్‌ఫ్రెండుతో కలిసి వీధుల్లో...
అందుకే వారు ఆండీతో నా రిలేషన్ అంగీకరించడం లేదు. ఈ కారణం చేతనే మేము గత నెల రోజులుగా ఆశ్రయం లేని స్థితిలో ఉన్నాము అని ఇట్టా తెలిపారు. మేము పోలీసులను ఆశ్రయించాం, ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించాం, ఎల్‌జిటిక్యూ కమ్యూనిటీ షెల్టర్లను ఆశ్రయించాం... ఎవరూ మాకు సహాయం చేయడం లేదు అని ఎట్టా ఎన్‌ తెలిపారు.
నేను స్విలింగ సంపర్కురాలిని, అందుకే...
జాకీ చాన్- మాజీ బ్యూటీ క్వీన్ ఎలైన్ ఎన్ సంతానమే ఎట్టా ఎన్‌. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నపుడు ఎట్టా ఎన్ జన్మిచారు. కాగా, ఎట్టా ఎన్ చేసిన పని జాకీ చాన్,  ఎలైన్ ఎన్ జీర్ణించుకోలేక పోతున్నారు. తమ కూతురు విషయంపై స్పందించడానికి వారు ఇష్ట పడటం లేదు 


మరింత సమాచారం తెలుసుకోండి: