కొన్ని ప్రముఖ మీడియా సంస్థల పై ముఖ్యంగా కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ పై పవన్ యుద్ధం ప్రకటించి ఫిలిం ఛాంబర్ ఆఫీసులో నిరసన దీక్షకు ఉపక్రమించినప్పుడు అల్లు అర్జున్ పవన్ కు మద్దతు తెలుపుతూ ఫిలిం చాంబర్ ఆఫీసుకు వెళ్ళడమే కాకుండా అక్కడ పవన్ ను భావోద్వేగంతో కౌగలించుకున్న సందర్భం అందరి దృష్టిని ఆకర్షంచింది. దీనితో పవన్ చేస్తున్న మీడియా యుద్ధంలో బన్నీ కూడ ఒక వీర సైనికుడు అనుకున్నారు అంతా. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే అల్లు అర్జున్ కు ఇప్పుడు హడావిడిగా మీడియా సంస్థ ప్రతినిధులు గుర్తుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ మూవీ ప్రమోషన్ కు సహకరించమని కోరుతూ బన్నీ మీడియా ప్రతినిధులకు భారీ స్థాయిలో కాక్టెయిల్ పార్టీ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో జూనియర్ తన ‘జనతాగ్యారేజ్’ విడుదలకు ముందు ఇలాంటి భారీ పార్టీ ఇచ్చి మీడియా వర్గాల సహాయ సహాకారాలను అభ్యర్ధించిన విషయం తెలిసిందే. 
సంబంధిత చిత్రం
ఈసమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ కావడంతో బన్నీ ‘సూర్య’ పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీనితో అల్లు అర్జున్ ఇలా మీడియా వర్గాల సహాయసహకారాలను కోరుతున్నాడనుకోవాలి. పవన్ కొన్ని మీడియా సంస్థల అధినేతల పై యుద్ధం చేస్తుంటే బన్నీ మాత్రం తనకు అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఒకటే అన్న సంకేతాలు ఇస్తూ ఈ పార్టీకి అన్ని వర్గాలకు చెందిన మీడియా ప్రతినిధులను అలాగే ఛానెల్స్ ప్రతినిధులను ఆహ్వానించినట్లు టాక్. 
ALLUARJUN IN NAAPERU SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు ‘నాపేరు సూర్య’ బిజినెస్ సుమారు 80 కోట్ల పైన జరిగినట్లు తెలుస్తోంది. దీనితో ఈసినిమా బయ్యర్లు లాభపడాలి అంటే ఈమూవీకి కూడ 100 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికి కూడ ‘భరత్’ బయ్యర్లు ఇంకా లాభాల బాట పట్టని నేపధ్యంలో సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ బన్నీ తన ‘సూర్య’ ద్వారా చేస్తున్న ప్రయత్నం దేశభక్తితో పాటు ఈమూవీ బయ్యర్లకు ధనవర్షం కురిపించాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: