మహానటి ఆడియో రిలీజ్ వేడుకలో లో తారక్ మాటలు నూతన చర్చలకు దారి తీస్తున్నాయి. ఇందులో  'క్యామియో తరహా'  లో ఉండే తన తాత ఎన్టీఆర్ పాత్రలో నటింప జేయటం కోసం స్వప్న దత్, ప్రియ దత్లు తనను కలిసారని కాని తాను మాత్రం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని వేదికపై నిర్మొహమాటంగా చెప్పేసాడు. తన తాత పాత్ర వేసేంత దమ్ము తనకు లేదని ఈ జన్మలో ఆ మహానుభావుడి వేషం వేసే సాహసం చేయలేనని చేయబోనని కుండ బద్దలు కొట్టేసాడు.
NTR on mahanaTi Stage   కోసం చిత్ర ఫలితం
సరిగ్గా ఇదేమాట గురించి సినిమా ప్రేమికుల్లో చర్చ మొదలైంది. తనకు అంత దమ్ము లేదని చెప్పడం తాత మీద ఉన్న గౌరవాన్ని ప్రేమను సూచిస్తుంది. అక్కడితో
ఆగక తన జీవితంలో తాత చేసినపాత్రలు జన్మలో చేసే సాహసం చేయనని అంత అర్హతలేదని వినమ్రంగానే చెప్పుకున్నాడు. ఆమాటల్లో బలమైన ఎమోషన్ కూడా కనిపించింది. కాని ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలోనూ ఇటు అభిమానుల్లో మరో కొత్త రకమైన చర్చకు దారి తీస్తోంది.

ఎన్టీఆర్ స్థాయి ఎవరికి లేదని ఒక పక్క తారక్ చెప్పడం మరోపక్క బాలకృష్ణ అదే పాత్రను తాను వేసేందుకు సిద్ధ పడటమేకాక దర్శకత్వ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకు నేందుకు సిద్ధపడినట్టు వార్తలు వస్తున్న సందర్భంలో తారక్ అన్న మాటలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించాయి. తనకు తాతయ్య పాత్ర వేసేంత స్థాయి ఈ జన్మ కు రాదన్న తారక్  మాటలు బాబాయ్ బాలయ్యకు మాత్రమే ఆ అర్హత ఉందన్న మాట కూడా చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. కాని ఆ ప్రస్తావన తీసుకురాకుండా కేవలం తన గురించి మాత్రమే చెప్పుకున్నందున తారక్ మాటలు ఇప్పుడు చాలా వేడి పుట్టిస్తున్నాయి. 

tarak on mahanati stage కోసం చిత్ర ఫలితం

ప్రత్యక్షంగా కాకపోయినా తాజాగా "ఎన్టీఆర్ బయోపిక్" తీసే సన్నాహాల్లో ఉన్న నందమూరి బాలకృష్ణను ఉద్దేశించే ఆ మాట అన్నాడు అనేలా కొన్ని కామెంట్స్ రావడమే కాదు అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. నిజానికి అటు పక్క ముహూర్త బలమో ఇంకే కారణమో తెలియదు కాని రెగ్యులర్ షూటింగ్ వెళ్ళడానికి ముందే దర్శకుడి విషయంలో బాలకృష్న పదరానిపాట్లు పడుతున్నారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ అంటే గౌరవం ఉన్న తారక్ ఇలా కావాలనిఅనే ఉద్దేశం లేకపోవచ్చు. ఇక్కడ మరో విషయం గమనించాలి. ఇటీవలే వివో బ్రాండ్ తరఫున పాల్గొన్న 'ఐపిఎల్ ప్రెస్ మీట్' లో తాతగారి బయోపిక్ లో నటిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తారక్ జవాబు చెబుతూ పిలిస్తే తప్పకుండా వెళ్లిచేస్తాను. అది తాత గారి పాత్ర తప్ప అన్నాడు. అంటే ఒక వేళ బాలకృష్ణ నిజంగా పిలిస్తే టైటిల్ రోల్ కాకుండా వేరే ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా!

tarak on mahanati stage కోసం చిత్ర ఫలితం

ఇంత అంతరాంతరాల పరీక్ష ఇక్కడ అనవసరం. తారక్ అన్న మాటలు సావిత్రి గారి బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర అంటే చాలా అంచనాలు ఉంటాయి, కాబట్టి దానితో పాటు పోలిక పెట్టడం లాంటివి చేస్తారు కనక అలా చెప్పి ఉంటాడు తప్ప అదే పనిగా బాలకృష్ణకు కౌంటర్ వేయడానికో? లేక ఇంకేదో? మనసులో పెట్టుకుని అంత పెద్ద వేదికను వాడుకునే అపరిపక్వత చూపించే అవకాశమే లేదు. కాబట్టి నిన్న జరిగిన వేడుకలో తన తాత మీద గౌరవాన్ని ప్రదర్శించిన తారక్ మాటలకు విపరీత అర్థాలు అయితే తీసారు కాని నిజానికి అంత దృశ్యం అక్కడ లేదనే చెప్పాలి. 

సంబంధిత చిత్రం

ఆల్రెడీ నాగ చైతన్య తాత ఏఎన్నార్‌ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్‌ కూడా పోషించి ఉంటే బాగుండేది అని ఆడియన్స్‌, అభిమానులు భావిస్తున్నారు. ఆ యాంగిల్‌ నుండి చూస్తే ఎన్టీఆర్‌ ఈ అరుదైన ఛాన్స్‌ని మిస్‌ చేసుకున్నాడనే అనిపిస్తోంది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు.

ntr in yamadonga కోసం చిత్ర ఫలితం

ఇప్పటికే నాగ చైతన్య తన తాత ఏఎన్నార్‌ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తను కూడా తన తాత ఎన్టీఆర్‌ పాత్ర కూడా పోషించి ఉంటే బాగుండేది అని ఆయన అభిమాన ప్రేక్షకులతో పాటి అక్కడి ఆడియన్స్‌ వ్యక్తం చేశారు. ఆ కోణం నుండి చూస్తే ఎన్టీఆర్‌ ఒక అరుదైన అవకాశం వదిలేసుకున్నాడేమో? అనే అనిపిస్తోంది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి కదా! అలాంటిది ఆయన పాత్రను పోషించే అర్హత, స్థాయితనకు లేవని చెప్పటాన్ని ఏ తెలుగు ప్రేక్షకుడూ అంగీకరించడు. యమదొంగ లో యముడి గెటప్ తో ధుమ్ముదులప లేదా? ఎన్టీఆర్‌. తాత పాత్రలో కనిపించడం ఇష్టం లేదన్న ఎన్టీఆర్‌ చెప్పిన కారణం సరైంది కాదనిపిస్తోంది. అలాగే ఆ రామారావు పాత్రలు చేసే సత్తా తారక్ కు తప్ప వేరెవరికీ లేదు. బహుశ తారక్ తన అభిప్రాయం మార్చుకోక తప్పదు.  

junior and senior ntr కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: