ఇంగ్లీషు ఛానెళ్లలో తెలుగు సినిమాల ప్రకటనలు కనిపించవు. అసలు దక్షిణాది సినిమాలకు సంబంధించిన వార్తలు కానీ విశ్లేషణలు కానీ ఇంగ్లీష్ ఛానల్స్ దరిదాపులో ఉండవు. ఇలాంటి పరిస్థుతులలో రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ మ్యానియా ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ ‘హెచ్బీవో’ లో హడావిడి చేస్తూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
ALLUARJUN IN NAAPERUSURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
హోమ్ బాక్స్ ఆఫీస్ అంటూ ‘హెచ్బీవో’ ఛానెల్ లో వచ్చే సినిమాలను దేశ వ్యాప్తంగా అనేకమంది చూస్తూ ఉంటారు. అలాంటి ఛానల్ లో ఇప్పుడు ‘నాపేరు సూర్య’ ప్రమోషన్ కనిపిస్తోంది. దీనికితోడు బన్నీ క్రేజ్ ను ఆ ఛానల్ ప్రమోషన్ కు వాడుకుంటున్న పద్ధతి కూడ షాకింగ్ న్యూస్ గా మారింది.  
ALLUARJUN IN NAAPERUSURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఒక తెలుగు హీరో ఆంగ్ల ఛానెల్ ను చూడమని ప్రమోట్ చేస్తూ వస్తున్న యాడ్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. పనిలో పనిగా ఈ యాడ్ లో ‘నాపేరు సూర్య’ హీరో అంటూ బన్నీ ప్రస్తావన తీసుకు వస్తూ ఉండటంతో ఈమూవీ న్యూస్ ఇంకా విడుదల కాకుండానే జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిపోయింది. ఇంతవరకూ కేరళ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన బన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యాడ్ తో నేషనల్ సెలెబ్రెటీగా పాపులర్ అవుతున్నాడు. 
సంబంధిత చిత్రం
తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఒకేసారి రేపు విడుదల అవుతున్న ఈమూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఈమూవీకి ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాలకు మించి ఓపెనింగ్ కలక్షన్స్ వస్తే కాని ఈసినిమా బయ్యర్లు గట్తెక్కరు అన్న మాటలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: