నాణ్యత, లభ్యత, ధరవరలలో కొంత వెసులుబాటు ఎక్కడ ఉన్నా వస్తు కొనగోలుకు వినిమయదారుడు అక్కడికే వెళతాడు. అందుకే నాణ్యత పెంచుకోవాలి దానికి కావలసిన నైపుణ్యం, నేర్పు, కొత్తదనం, ధరలో కొంత వెసులు బాటు సాధించుకొన్న చోటనే వినిమయ దారులు వెళ్ళి తమకు నచ్చిన వస్తువులు కొంటారు. అదే వస్తు వినిమయ సిద్ధాంతం. ఇది సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. 
 
బాలీవుడ్ పితామహుడనతగ్గ నటుడు అమితాబచ్చన్ తన బాలీవుడ్ చిత్రరంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో "చిత్రపరిశ్రమ" కు గడ్డు కాలం  రానున్నదని, ముప్పు ఇప్పటికే పొంచివున్నదని ఆయన ముందుగానే పసిగట్టేసినట్లు ఆయన మాటలతో అర్ధం అవుతుంది.

అమితాబ్ ఆయన నటిస్తున్న "102 నాటౌట్"  సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సందర్భంగా  మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా హాలీవుడ్‌ సినిమాలను  చూడటానికి మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ తన ప్రేక్షకులకు హాలీవుడ్‌ మూవీలను ఎక్కువగా ప్రోత్సహించరాదని, అది మనదేశీయ చిత్ర పరిశ్రమను సర్వనాశనం చేస్తుందని, ఇప్పటికే కొంత నష్టం చేసిందని వ్యాఖ్యానించారు. 

హాలీవుడ్‌ చిత్రాలు భారత్లో విడుదలై భారీగా వసూళ్ళు సాధించుకుంటున్నాయని అన్నారు. హాలీవుడ్‌ పరిశ్రమలో మనీ, ఎక్స్‌పీరియన్స్, క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ ఉన్నా యని, అవిలేకుండా వారికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్‌‌ లో విభిన్న కథ, కథనాలతో  సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా వుందని వక్కాణించిన ఆయన, సాంకేతిక పరంగా మనం ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని మన సాంకేతికత ప్రపంచ చిత్ర విఫణికి సరిపోదన్నారు.

ఇప్పుడు చిత్రరంగంలోకి వస్తున్న యువ దర్శకులు, హాలీవుడ్‌ స్థాయి లో సినిమాలు తీయగరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన కొన్ని హాలీవుడ్ సినిమా లు ఇండియాలో వందకోట్ల క్లబ్‌ లోకి చేరిన విషయాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ పదే పదే గుర్తుచేస్తున్నారు.  కొత్త నైపుణ్యాలను సాంకేతికతలను ఎంతో సాధిస్తే తప్ప బాలీవుడ్ లేదా 'ఇండియా సినిమా'  హాలీవుడ్ నుండి వచ్చే పోటీని తట్టుకోవటం కష్టసాధ్యమని చెప్పకనే చెప్పారు అమితాబ్ బచ్చన్. ఇది యువ దర్శకులకు సాంకేతిక నిపుణులకు ఒక హెచ్చరికే. 

తొలి ఐదు రోజుల్లో అవెంజెర్స్ హాలీవుడ్ చిత్రం ₹173 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించింది. అందులో నెట్ వసూళ్ళు ₹135 కోట్లు. ఇదే పెద్ద ఋజువు హాలీవుడ్ చిత్రాలు భారత్ సినిమాని ఒక ఆట ఆడిస్తాయనటానికి. అమితాబ్ జోస్యం నిజమవటానికి పెద్ద సమయం లేదు. సమయం లేదు మిత్రమా! శరణమా! రణమా! అన్నట్లుంది బాలీవుడ్ పరిస్థితి. 

Avengers: Infinity War Box Office Collection Day 5 - Blockbuster Sets This Record In India

మరింత సమాచారం తెలుసుకోండి: