ఒకొక్కసారి సరైన నిర్ణయం తీసుకోవడంలో చేసే ఆలస్యం అనేక నష్టాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా రాజకీయాలలో అదేవిధంగా సినిమాలలో ఒక్క పోరపాటు నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం ఊహించని స్థాయిలో నష్టం చేకూరుస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మహేష్ ‘భరత్ అనే నేను’ కు ఎదురైంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
‘భరత్’ కు అర్బన్ సెంటర్లు ఓవర్ సీస్ లో కేవలం ప్రశంసలు మాత్రమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా దక్కాయి. ఓవర్ సీస్ లో మూడు మిలియన్ల మార్క్ ను దాటినా ఈమూవీ ఓవర్ సీస్ బయ్యర్ కు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అనివార్తలు వస్తున్నాయి. దీనికి కారణం గతవారం విడుదలై హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ అని అంటున్నారు. ఓవర్సీస్ లో ఉన్న మన తెలుగు ప్రేక్షకులు ‘భరత్’ ను రెండవసారి చూసే కన్నా ‘అవెంజర్స్’ సినిమాను చూడటానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసినిమా రాకపోయి ఉండి ఉంటే ‘భరత్’  పరిస్థితి వేరుగా ఉండేది.  కానీ  ‘అవెంజర్స్’ వచ్చి ‘భరత్’ ను ఓవర్సీస్ లో బాగా దెబ్బ తీసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENUMOVIE కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి ఓవర్సీస్ లో ‘భరత్’ విడుదలకు ముందే పబ్లిసిటీని పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసారు.  ఈ మూవీ విడుదల తరువాత వారంరోజులు కేవలం ప్రచారం మీదనే ఉన్న మహేష్ ఆంధ్రప్రదేశ్ లోని కీలక నగరాల పై దృష్టి పెట్టాడు కాని ప్రచార విషయంలో ఓవర్ సీస్ మార్కెట్ ను పూర్తిగా అశ్రద్ధ చేసాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.  ఇప్పటివరకు  మహేష్ పేరిట వున్న నాన్ ‘బాహుబలి’ రికార్డును ‘రంగస్థలం’ తో రామ్ చరణ్ పట్టుకుపోయిన నేపధ్యంలో మహేష్ ముందుగా ఆలోచించి కొరటాలతో కలిసి అమెరికా వచ్చి ‘భరత్’ ను ప్రమోట్ చేసి ఉంటే ఈసినిమాకు ఖచ్చితంగా 4మిలియన్స్ కలెక్షన్స్ వచ్చి ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
సంబంధిత చిత్రం
నిజానికి ఈప్లాన్ ‘భరత్’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ముందుగా వేసినా మహేష్ కొరటాల నుండి మొదట్లో స్పందన రాలేదని తెలుస్తోంది. అయితే ఆతరువాత మహేష్ ‘భరత్’ ను ప్రమోట్ చేయడానికి  అమెరికా రావడాని రెడీ చెప్పినా  అప్పటికే ఈమూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ తగ్గిపోయిన నేపధ్యంలో  ‘భరత్’ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ కు మహేష్ వస్తే ఖర్చులు తడిసి మోపెడు అవ్వడమే తప్ప ప్రయోజనం ఉండదు అని ఆ ఆలోచనకు స్వస్తి పలికినట్లు టాక్. దీనితో మహేష్ అమెరికా ప్రచారం అన్న ఐడియాకు ఫుల్ స్టాప్ పడిపోవడంతో ఇప్పుడు తన రూట్ మార్చి తన భార్యా పిల్లలతో మరో ఫారెన్ ట్రిప్ కు రెడీ అవుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: