సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అంటే తమిళ తంబీలే కాదు యావత్ భారత దేశ సినీ ప్రియులు ఎంతో ఇష్టపడతారు.  పా రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 వస్తుందని అనుకున్నారు..కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పెండింగ్ లో ఉంది.  ఇదే సమయంలో పా రంజీత్ తో మరోసారి ‘కాలా’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు మే డే రోజు రిలీజ్ అయిన మాస్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.
kabali-review-online-759
ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. వస్తాను అని ప్రకటించిన రజనీ మరికొంత సమయం తీసుకునేలా ఉన్నాడు. ఇంతలో వరస పెట్టి సినిమాలతో రాబోతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు సన్నద్ధం అవుతోంది. 65 ఏళ్ల వ‌య‌స్సులో కూడా కుర్ర హీరోల‌కి ధీటుగా సినిమాలు చేస్తున్నాడు ర‌జినీ.ర‌జనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ-కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Image result for kala movie stills
సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో ఇది 165వ చిత్రం. కాగా,  ఈ సినిమాకు రజనీ ఏకంగా 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సినిమాలకు ఉన్న మార్కెట్‌ను బట్టే ఆయన పారితోషకం తీసుకుంటున్నాడని ట్రేడ్ నిపుణులు అటున్నారు.
Image result for robo 2.0.
ఇటీవలే ‘కాలా’ సినిమా టెలివిజన్ రైట్స్ దాదాపు 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇదే క‌నుక నిజం అయితే ఇండియాలో అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: