నా పేరు సూర్య ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే యూనిట్ హంగామా మాములుగా ఉండదు. ప్రింట్ మీడియా లో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో హోరెత్తి పోతుంటుంది. అయితే నా పేరు సూర్య విషయం లో లా జరగడం లేదు. అయితే మీడియా కు మరియు  మెగా ఫామిలీ కి మధ్య జరిగిన వివాదం వల్లనే మీడియా కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని వార్తలు గుప్పు మంటున్నాయి. అప్పుడు మెగా స్టార్ చిరంజీవి మీడియా బ్యాన్ చేయాలని సంకేతాలను ఇవ్వడం వల్లే మీడియా లో ఎక్కువగా ప్రచారం చేయలేదని వార్తలు వస్తున్నాయి. 

Image result for allu arjun

ఇప్పటివరకు కేవలం ఓ కామన్ ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు బన్నీ. సినిమాకు సంబంధించి క్యాప్ ట్రిక్స్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతే.. అక్కడితో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిన్నటికినిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తారనుకుంటే ఓ యాప్ ను ప్రమోట్ చేశారు. ఇక ఈరోజైతే అంతా తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు.

Image result for allu arjun

ఓ సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ చెన్నై వెళ్లిపోయింది. హీరో బన్నీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నాగబాబు, లగడపాటి రిలాక్స్ అయిపోయారు. వక్కంతంను అడిగితే రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తానంటున్నాడు. ఇక సంగీత దర్శకులైతే అసలు హైదరాబాద్ కే రావట్లేదు. ఇలా మెయిన్ క్రూ అంతా కామ్ అయిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: