ఈ మధ్య మీడియా కు మరియు సినిమా ఇండస్ట్రీ కి ఓ రేంజ్ లో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ మీడియా ను బ్యాన్ చేయబోతోందని గుసగుసలు వినిపించాయి. అయితే తీరా అటువంటి ఊసే లేకపోయే సరికే అందరు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి మీడియా కు లక్షలు లక్షలు ఆదాయం సినిమా ప్రమోషన్స్ నుంచే వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా పరిస్థితులను చూస్తుంటే మీడియానే సినిమా వాళ్ళను బ్యాన్ చేస్తుందేమో అని సందేహాలు వస్తున్నాయి. 

Image result for srireddy

 ఇదిలావుంటే అసలు వివాదానికి కారణమైన శ్రీరెడ్డికి ఇప్పుడు కవరేజ్ లేకుండా పోయింది. నిన్నటికి నిన్న ఓ స్టూడియో దగ్గర హల్ చల్ చేద్దాం అనుకుంది. కుదరలేదు. ప్రెస్ క్లబ్ దగ్గరకు వెళ్లి కాస్త నాలుగు మాటల తూటాలు పేల్చుదాం అనుకుంది. కానీ మొత్తం మీడియాలో ఎక్కడా శ్రీరెడ్డి మాటలు కనిపించలేదు. వినిపించలేదు.

Image result for srireddy

గతంలో శ్రీరెడ్డి ఏ సోషల్ మీడియాలో అయినా ఊ.. అంటే అంత.. ఆ అంటే అంతకు అంత హడావుడి చేసిన మీడియా ఇప్పుడు శ్రీరెడ్డి అంటే ఎవరో తెలియనట్లుగా వుండిపోయింది. రోజూ గంటలకు గంటలు డిస్కషన్ కు పోటీలుపడి కార్లు పంపిన చానెళ్లు ఇప్పుడు ఆ బాపతు జనాలు అంటే ఎవరో తెలియనట్లు వుండిపోయింది. అంటే ఇప్పుడు అసలు సిసలు బ్యాన్ మీడియానే విధించింది అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: