తెలుగు ఇండస్ట్రీలో ‘రంగస్థలం’ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.  సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సంవత్సరానికి పైగా సమయం తీసుకున్నా..దానికి తగ్గ ఫలితాన్ని చిత్ర యూనిట్ ఆనందంగా అనుభవిస్తున్నారు.  ఈ చిత్రంలో మొదటి సారిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక చెవిటివాడి పాత్రలో నటించడం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. గ్లామర్ పాత్రలతో కుర్రాళ్ల మనసు దోచిన సమంత అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మి పాత్రలో వొదిగిపోయింది. 

ఏది ఏమైనా ‘రంగస్థలం’ చిత్రానికి చిట్టిబాబు పాత్రలో ప్రాణం పోశాడని చెప్పొచ్చు.  తాజాగా ‘రంగస్థలం’ సినిమాలో తన భర్త చెవిటివాడిగా నటించారని .. ఆ పాత్రకు తన భర్త జీవిం పోశాడని అన్నారు.   వినికిడి విలువేంటో తనకు తెలుసని ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో ఆసుపత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉపాసన అన్నారు.  అపోలో మెడికల్ కళాశాలలో హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ మూడో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఉపాసనతో పాటు డాక్టర్ వినయ్ కుమార్, ఐపీఎల్ సన్ రైజర్స్ జట్టు సభ్యులు రషీద్ ఖాన్, కార్లోస్ బ్రాత్ వయిట్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టావ్ మూడీ పాల్గొన్నారు.

హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ కు సన్ రైజర్స్ జట్టు మద్దతుగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన అన్నారు. ఎవరికైనా వైకల్యం రావడం దేవుడి శాపం కాదని..అది కొన్ని జన్యులోపాల వల్ల జరుగుతుందని..అలాంటి వారిని గుర్తించి మంచి చికిత్స అందిస్తే..చక్కటి ఫలితాలు వస్తాయని అన్నారు.

వినికిడి సమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారులు ఇప్పుడు అందరిలా చక్కగా వినగలుగుతున్నారని, ఈ తరహా సమస్యలు ఉన్న చిన్నారులు తమకు తెలియజేస్తే వారికి తమ వంతు సాయంగా వినికిడి ఉపకరణాలు తప్పకుండా అందజేస్తామని ఉపాసన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: