తమిళ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.. వివేక్‌.  సాధారణంగా ఎలాంటి కాంట్రెవర్సీల జోలికి వెళ్లని వివేక్..తాజాగా అమ్మాయిలపై కామెంట్ చేసి నెటిజన్ల కోపానికి గురైయ్యాడు. 'ప్రియమైన విద్యార్థులారా.. వేసవి వచ్చేసింది' అంటూ ఆయన పిల్లలకు కొన్ని సూచనలు చేశాడు.
Image result for tamil comedian vivek
సెలవులను ఆస్వాదించాలని, ఆటలాడిన తరువాత నీళ్లు ఎక్కువగా తాగండని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాత ఆడ పిల్లలూ వంటగదిలో మీ అమ్మకు సాయంగా ఉండండి అని, వంట నేర్చుకోండని, ఇక మగ పిల్లలు తమ తండ్రి పని ప్రదేశానికి వెళ్లి, కుటుంబం కోసం ఆయన ఎలా పనిచేస్తున్నారో చూడండని, బలంగా ఉండండని పేర్కొన్నాడు. 
Image result for tamil comedian vivek
అయితే వివేక్ ట్విట్ పై మహిళా సంఘాలు, యువతులు మండి పడుతున్నారు.  భారత దేశంలో ఎంతో అభివృద్ది చెందుతుందని..ఇక్కడ పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని..అలాంటింది..ఇంకా వంటింటి కుందెళ్లలా బతకాలని సూచిస్తున్న ఆయన ట్విట్ పై అభ్యంతరం చెబుతున్నారు.
Image result for tamil comedian vivek
డిజిట‌ల్ యుగంలో ఆడాళ్ళు మ‌గాళ్ళ‌తో పోటి ప‌డుతుండ‌గా, ఇంకా ఆడ‌వారిని వంటింటికే ప‌రిమితం అవ్వ‌మ‌ని సూచ‌న‌లు ఇస్తున్నారా.. ఆడ‌వాళ్లు ఇప్పుడు వంటింటి కుందేళ్ళు కాదు, అంతరిక్షంలోకి కూడా వెళుతున్నారంటూ చుర‌క‌లంటించారు. దీనిపై వివేక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: