టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య ఈ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ల‌గ‌డ‌పాటి శ్రీథ‌ర్‌, బ‌న్నీ వాస్ నిర్మాత‌లుగా నాగ‌బాబు స‌మ‌ర్పణ‌లో తెర‌కెక్కింది. ఇక ఈచిత్రంలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ న‌టించింది. ఇక ఈ చిత్రంలో బ‌న్నీ ఓ ప‌వ‌ర్ ఫుల్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా కెరీర్‌లోనే తొలిసారి సీరియ‌స్ రోల్‌లో న‌టించాడు. క్రమ‌శిక్షణ‌కు మారు పేరైన సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ క‌నిపిస్తాడు.
Image result for na peru surya
బ‌న్నీతండ్రి పాత్రను అర్జున్ న‌టించాడు. కథ సడన్ గా వేరే జానర్ లోకి షిఫ్ట్ కావ‌డంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పోతుంది.  ఈ విషయంలో ఆడియన్స్ కాస్త విసుగు చెందినట్లు అనిపించింది.  హీరో పాత్ర కనెక్ట్ అయితేనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అయితే అదే ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి.సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించినా.. అలా మెప్పించిన మరో నిమిషానికే సినిమా స్లో అయిపోతుంది. 
Image result for na peru surya
మొదట బన్నిని యాంగ్రీ యంగ్ మాన్ గా చూపించి తర్వాత క్రమంలో కోపాన్ని కంట్రోలో చేసుకునే వ్యక్తిగా చూపించడం పాత సినిమాలు ఎన్నో చూసిన అనుభూతి కలిగిందని ఆడియాన్స్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రస్తుతం.. కొంచెం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కథ సాగుతుంది. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కవర్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సన్నివేశాలు మినహాయించి ఇతర సన్నివేశాలు కొంచెం రోటిన్ గా అనిపిస్తాయి. అసలైన ఇంటర్వెల్ పాయింట్ సినిమా సెకండ్ హాఫ్ పై పెద్దగా ఆసక్తిని పెంచదు.
Image result for na peru surya
అయితే, “లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో“ సాంగ్ కొంచెం బెటర్ చెప్పాలి. అందులో బన్నీ క్యాప్ ట్రిక్స్ మెప్పిస్తాయి.  ఈ సినిమాలో అగ్ర హీరోలు అర్జున్, శరత్ కుమార్, నదియా, బొమన్ ఇరాని, రావు రమేష్ లాంటి వారు తమ పరిథిమేరకుమెప్పించారు. ఏది ఏమైనా సినిమా రేపటి వరకు వచ్చే రిజల్ట్ ని బట్టి హిట్టా..ఫట్టా అనేది తేలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: