రణ్ మహేష్ అల్లు అర్జున్ ఇలా ఎవరు సమ్మర్ రేస్ విజేత అని గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు నిన్న విడదలలైన ‘నాపేరు సూర్య’ ఫైనల్ టాక్ బయటకు రావడంతో ఫలితం కూడా తేలిపోయింది. ‘నాపేరు సూర్య’ మూవీపై మొదటి నుంచీ మిక్స్డ్ టాక్ నడుస్తోంది.
సంబంధిత చిత్రం
కామన్ ఆడియెన్స్‌ కి ఈసినిమా ఊహించినంతగా కనెక్ట్ కాలేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చూపిన బన్నీ మీదే సినిమా  ఫైనల్ రిజల్ట్  డిసైడ్ అవుతుందని రివ్యూలు చెబుతున్నాయి. అల్లుఅర్జున్ కు ఉండే క్రేజ్ రీత్యా  ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ బాగానే ఉన్నా ఈ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ వల్ల ఈరోజు నుండి ఈమూవీ రోజు నుండి డ్రాప్ అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు.
ALLUARJUN IN NAAPERUSURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సుమారు 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈమూవీ వల్ల భారీగా బయ్యర్లు నష్టపోతారు అని వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ కూడ బయ్యర్లకు నష్టాన్నే మిగిల్చింది అన్న వార్తలు ఉన్నాయి. దీనితో అల్లు అర్జున్ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు వరసగా రెండవసారి కూడ నష్టాల బాట పట్టబోతున్నట్లు అర్ధం అవుతోంది. 
ALLU ARJUN IN NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతులు బన్నీ భవిష్యత్ సినిమాల మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సూర్యను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ప్రచారం జరగబోతోంది అని అరవింద్ ఊహించినట్లుగానే ఈమూవీ పై భయంకరమైన నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తట్టుకుని ఎంతవరకు కలక్షన్స్ పరంగా ‘సూర్య’ నిలబడుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈమూవీని ఒప్పుకుని తప్పు చేసానా అన్న అంతర్మధనంలో ప్రస్తుతం బన్నీ ఉన్నట్లు టాక్. ‘నాపేరు సూర్య’ కు వచ్చిన డివైడ్ టాక్ ప్రస్తుతం కలక్షన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న ‘భరత్’ బయ్యర్లకు అదృష్టంగా మారే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: