టైటిల్ చూసి కాస్త వెరైటీగా అనిపించినా నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేల టికెట్ కు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదెలా అంటే మాస్ మహరాజ్ రవితేజ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న నేల టికెట్ సినిమాకు పవన్ కళ్యాణ్ తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియోకి రవితేజని విష్ చేసేందుకు పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నారు.

Image result for nela ticket

ఈమధ్య స్టార్ హీరోల్లో స్నేహం చాలా పెరిగింది. మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇక బన్ని నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాం చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేలటికెట్ టీంను విష్ చేసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.

సినిమాలకు దూరమైన పవన్ ఈమధ్య సినిమా వేడుకలకు ఎక్కువగానే అటెండ్ అవుతున్నాడు. తన సమర్పణలో వచ్చిన ఛల్ మోహన్ రంగ సినిమా ఈవెంట్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ మళ్లీ రంగస్థలం సక్సెస్ మీట్ లో కనిపించి అలరించాడు. ఇక ఇప్పుడు నేల టికెట్ కోసం రవితేజను ప్రమోట్ చేస్తున్నాడు.


తనకు ఇంతటి క్రేజ్ ఇచ్చిన సినిమా ఇండస్ట్రీపై పవన్ కు ప్రత్యేకమైన అభిమానమని చెప్పాలి. ఇక తన సినిమాల విషయానికొస్తే అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంటున్న పవన్ 2019 ఎలక్షన్స్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: