సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్‌లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథా, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ స్టార్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఆవిష్కరించారు.  గత కొంత కాలంగా చాలా వేగంగా ఎదిగాడు అల్లు అర్జున్. ఐతే వరుస విజయాలతో ఊపుమీదున్న అతడికి గత ఏడాది ‘దువ్వాడ జగన్నాథం’ బ్రేక్ వేసింది.
Image result for na peru surya
తాజాగా  ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన నా పేరు సూర్య. తెలుగులోనే గాక తమిళ, మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో బహుభాష నటులు ఉండటం, అల్లు అర్జున్‌ సినిమాలకు ఏపీ ఆవల కూడా మంచి క్రేజే ఉండటంతో ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌ను పొందుతోంది.
Image result for na peru surya
శరత్ కుమార్, అర్జున్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో చేశారు. అలాగే నదియా కూడా నటించింది. వీళ్లు దక్షిణాది అంతా గుర్తింపు ఉన్న నటీనటులు.  ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి సక్సెస్ బాటలో నడుస్తుంది.   ఇప్పటికే రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
Related image
ఇక మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి.  ఇప్పుడు బన్నీ నటించిన ‘నా పేరు సూర్య’  కలెక్షన్లపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి వారంలో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

నా పేరు సూర్య ఫస్ట్ డే కలెక్షన్స్ : 

Nizam - 4.05 Cr

East - 2.06 Cr

West - 1.54 Cr

Nellore - 0.64 Cr

Ceeded - 2.7 Cr 

Krishna - 1.04 Cr

Guntur - 2.48 Cr

.........

AP - 9.8 Cr

Nizam - 4.05 Cr

Ceeded - 2.7 Cr

Total share : 16.55 Cr

U A - 2.02 Cr

........


మరింత సమాచారం తెలుసుకోండి: