భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నట వారుసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్.  ఇక ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అయినా..ఆయన వైవాహిక జీవితంపై ఎన్నో రూమర్లు వచ్చాయి.  మొదట వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి..తన సహనటి అయిన సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్.  ఆ తర్వాత సారికతో విభేదాలు వచ్చిన తర్వాత నటి గౌతమితో చాలాకాలం పాటు సహజీవనం చేశారు.
Image result for kamal hassan sarika
ఈ మద్య కొన్నికారణాల వల్ల వీరు కూడా విడిపోయారు.  ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే..రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.  ఆయన కూతురు శృతిహాసన్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తుంది. నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
Image result for kamal hassan sarika
ఈ సినిమా సెట్ కు శృతిహాసన్ తల్లి సారిక వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సెట్ కు వచ్చిన తన తల్లిని చూసిన శృతిహాసన్ సంతోషానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా సారికను చిత్ర యూనిట్ ఆప్యాయంగా పలకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 
Image result for sarika shruti hassan akshara
శృతిహాసన్ మాట్లాడుతూ..సెట్స్ లో తన తల్లిని చూసి ఒక్కసారే ఆశ్చర్యపోయానని..తన నటనపై సారిక ప్రశంసలు గుప్పించడమే కాకుండా తనకు నటనలో కొన్ని మెలుకువలు కూడా నేర్పించారని అన్నారు.  దర్శకుడు మహేశ్ తో తన తల్లికి పరిచయం ఉందని, ఆయన సూచనలతో నటిస్తున్న తనను ఆమె అభినందించిందని శృతిహాసన్ సంతోషం వ్యక్తం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: