సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇటీవ‌ల ఆమెరికా వెళ్లి రెగ్యుల‌ర్ మెడిక‌ల్ చెక‌ప్ చేయించుకున్నారు. గతంలో ‘కబాలి’ సినిమా రిలీజ్ తర్వాత ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆయన తన చిన్న కూతురు తో అమెరికా కి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.  ప్రస్తుతం ‘కాలా ’ సినిమాలో నటించిన ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే.   ఇటీవల హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువ‌ల్ డ్రెస్ ధ‌రించి బ్లాక్ స‌న్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపించారు.. వైద్య ప‌రీక్ష‌లు పూర్తి కావ‌డంతో గ‌త రాత్రి ఆయ‌న విమానంలో ఆమెరికా నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు.   చాలా రోజుల తరువాత చెన్నైకి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటికి వెళ్లిన ర‌జ‌నీకి ఆయన స‌తీమ‌ణి హార‌తి ఇచ్చి బొట్టు  పెట్టి హార‌తి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక‌ ర‌జనీ న‌టించిన కాలా మూవీ ఆడియో వేడుక ఈ నెల 9న జ‌ర‌గ‌నుంది.
Image result for కాలా ఆడియో
ఈ కార్య‌క్ర‌మంలో ర‌జనీకాంత్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొననున్నారు. ఆ త‌ర్వాత కార్తీక్ సుబ్బ‌రాజు డైరెక్ష‌న్‌లో త‌న త‌దుప‌రి సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు ర‌జ‌నీకాంత్. కాగా,  పా రంజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జూన్ 7న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌, రీసెంట్‌గా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు.
Kaala Audio Launch Venue Finalized
య‌మ గ్రేట్ అంటూ సాగే ఈ పాట‌కి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించ‌గా, హ‌రిహ‌ర‌సుధ‌న్,సంతోష్ నారాయణ్ క‌లిసి పాడారు.ఈ సాంగ్ ర‌జ‌నీ అభిమానుల‌ని అల‌రించింది. ఇక చిత్ర ఆడియో వేడుక‌ని మే 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో జ‌ర‌ప‌నున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: